పత్తి కొనుగోళ్లు కొనసాగించాలని ధర్నా
మునుగోడు: రైతులకు ఎలాంటి సమచారం ఇవ్వకుండా సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు నిలపివేయడం సరైది కాదని, యథావిధిగా కొనుగోళ్లు కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పలువురు రైతులు మునుగోడులోని సలాసర్ బాలాజీ పత్తి మిల్లు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దాదాపు వం మందికి పైగా రైతులు పత్తిని అమ్ముకునేందుకు మిల్లు వద్ద క్యూ కడితే సీసీఐ అధికారులు కొనుగోళ్లు నిలిపివేయడం తగదని, ఇప్పుడు పత్తిని ఎక్కడా అమ్ముకోవాలని నిలదీశారు. అయినా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో మునుగోడు – చౌటుప్పల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఎం.నరేందర్, ఎస్‌ఐ రవిలు సంఘటన స్థలానికి వెళ్లి సీసీఐ అధికారులతో మాట్లాడి రైతుల పత్తి కొనుగోళ్లు చేసేలా ఒప్పించి రైతుల రాస్తారోకో విరమింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment