సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె విరమణ
నల్లగొండ టౌన్: తమను రెగ్యులరైజ్ చేయాలని 28 రోజులుగా కలెక్టరేట్ ఎదుట నిరవధికంగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష అబియాన్ ఉద్యోగులు మంగళవారం సమ్మెను తాత్కాలికంగా విరమించారు. ఈ మేరకు తాము విధుల్లో చేరుతున్నట్లు డీఈఓ భిక్షపతి, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్‌కు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు మొలుగూరి కృష్ణ, కార్యదర్శి బి.రాజు మాట్లాడుతూ ప్లానింగ్ బోర్డు కమిషన్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో ఉద్యోగ సంఘం నాయకులు చర్చించారన్నారు. పేస్కేలు అమలులో కేబినెట్ సబ్‌కమిటీ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని, సమ్మె కాలానికి వేతనాలు చెల్లిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారని దీంతో ప్రభుత్వంపై నమ్మకం ఉంచి సమ్మెను తాత్కాలికంగా విరమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, మహేందర్, క్రాంతికుమార్, నీలాంబరి, మంజులరెడ్డి, స్వప్న, సుజాత, రాజేశ్వరి, వెంకట్, అంజయ్య,నాగబూషనచారి, వెంకటేశ్వర్లు, ధనలక్ష్మి, జానయ్య, గణేష్, నాగరాజు, మోహిజ్, భిక్షం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment