మంత్రికి ఆహ్వానం పలుకున్న ఈఓ
● నలుగురికి గాయాలు
ఎమ్మిగనూరు రూరల్: పట్టణంలోని కర్నూలు రోడ్డు అంపయ్య పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం సాయంత్రం కూలీల ఆటోను వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొంది. ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు గాయపడ్డారు. మండల పరిధిలోని దేవబెట్ట గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో సిరాలదొడ్డి గ్రామ పరిధిలోని పొలానికి పనికి వెళ్లారు. సాయంత్రం గ్రామానికి ఆటోలో బయలుదేరారు. ఘటనా స్థలానికి చేరుకోగానా వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొనడంతో వెనుక సీట్లో కూర్చున్న పార్వతి, లక్ష్మి, రజిత, శకుంతలకు గాయాలయ్యాయి. పార్వతి, రజితలకు రెండు కాళ్లు విరిగిపోయాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం పార్వతి, లక్ష్మిలను కర్నూలుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ట్రాఫిక్ ఎస్‌ఐ సురేష్‌కుమార్ తెలిపారు.
ఆదోనిలో పట్టపగలే చోరీ
ఆదోని అర్బన్: పట్టణ శివారులోని ఆలూరు రోడ్డులో ఉన్న భీమిరెడ్డి కాలనీలో సోమవారం మధ్యాహ్నం చోరీ జరిగింది. అజమత్‌భాను తన ఇంటికి తాళాలు వేసి మనవడికి ఆరో గ్యం బాగోలేకపోతే చూసేందుకని హైదరాబాద్‌కు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలకు చొరబడి బీరువాలోని మూడున్నర తులాల బంగారం, 25 తులాల వెండి, రూ.5 వేల నగదుతో ఉడాయించారు. మంగళవారం ఉదయం ఆమె ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగులగొట్టి ఉండటం, బీరువా తెరిచి ఉండటం గమనించి చోరీ జరిగిందని నిర్ధారించుకుని టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
శ్రీశైలం చేరుకున్న
డిప్యూటీ సీఎం
శ్రీశైలంటెంపుల్: డిప్యూటీ సీఎం దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మంగళవారం రాత్రి శ్రీశైల మహాక్షేత్రానికి చేరుకున్నారు. భ్రమరాంబా అతిథిగృహం వద్ద మంత్రికి దేవస్థానం ఈఓ పెద్దిరాజు పుష్పగుచ్ఛాలతో ఆహ్వానం పలికారు. బుధవారం క్షేత్ర పరిధిలో పలు అభివృద్ధ్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
వ్యక్తి ఆత్మహత్య
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల పట్టణంలో ఓ వ్యక్తి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంజామల మండలం ఆల్వకొండ గ్రామానికి చెందిన చిన్న ఖాశీం(42) మానసిక స్థితి కొద్ది రోజులుగా సరిగా ఉండేది కాదు. ఉదయం స్వగ్రామం నుంచి కోవెలకుంట్లకు చేరుకొని హాస్పిటల్ సమీపంలో క్రిమిసంహారక మందు తాగి పడిపోవడంతో స్థానికులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఖాశీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వెంకటరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment