శ్రీశైల క్షేత్రం
శ్రీశైలంటెంపుల్: తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైల మహాక్షేత్రాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఏటేటా రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు పకడ్బందీ ప్రణాళికతో పనులు చేపడుతోంది. ఈ మేరకు బుధవారం రూ. 215.04 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన జరుగనుంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి తదితరులు ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. రూ.75 కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణం, రూ.52 కోట్లతో 200 గదుల వసతి సముదాయం, రూ.35 కోట్లతో సాలుమండపాల నిర్మా ణం, శివం రోడ్డు సుందరీకరణ, రూ.23.40 కోట్లతో శివసేవకులకు వసతిగృహ నిర్మాణం, రూ.7 కోట్లతో వన్‌మెగా వాట్ సోలార్‌పవర్ ప్లాంట్ నిర్మాణం, రూ.5.85 కోట్లతో దేవస్థాన ఉద్యోగుల నివాస సముదాయానికి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, సబ్‌స్టేషన్ నిర్మాణం, రూ.5.50 కోట్లతో హేమారెడ్డి మల్లమ్మ మందిరం నుంచి డంపింగ్‌యార్డ్ వరకు కాంక్రీట్‌రోడ్డు నిర్మాణం, రూ.2.60 కోట్లతో వెయ్యి కిలో లీటర్ల వాటర్‌స్టోరేజ్ రిజర్వాయర్ నిర్మాణం, రూ.2 కోట్లతో ఐదు వందల కిలో లీటర్ల వాటర్ స్టోరేజ్ రిజర్వాయర్ నిర్మాణం (హఠకేశ్వరం), రూ.1.60 కోట్లతో 500 కిలో లీటర్ల వాటర్‌స్టోరేజ్ రిజర్వాయర్ నిర్మాణం (ఫిల్టర్‌బెడ్ ఏరియా), రూ.1.98 కోట్లతో కల్యాణ మండపం నిర్మాణం (దోర్నాల), రూ.1.26 కోట్లతో షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మాణం (దోర్నాల), రూ.99 లక్షలతో అమ్మవారి ఆలయంలో ఉత్తర సాలుమండపాల పునర్నిర్మాణం, రూ.86 లక్షలతో పంచమఠాల చుట్టూ కంచె.. ఇలా మొత్తం రూ.215.04 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
రూ.215.04 కోట్లతో నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హాజరుకానున్న డిప్యూటీ సీఎం
సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా
Comments
Please login to add a commentAdd a comment