ఇంట్లోనే ఓటేశారు | Sakshi
Sakshi News home page

ఇంట్లోనే ఓటేశారు

Published Mon, May 6 2024 9:10 AM

ఇంట్ల

జిల్లా వ్యాప్తంగా 504 మంది

ఓటు హక్కు వినియోగం

నంద్యాల: సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం పోలింగ్‌ నమోదు కావాలనే లక్ష్యంతో పోలింగ్‌ కేంద్రాలకు రాలేని వారు సైతం ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్‌ హోమ్‌ ఓటింగ్‌ను ప్రవేశ పెట్టింది. 2024 ఎన్నికలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్‌, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జిల్లాలో 312 మంది 85 సంవత్సరాలు దాటిన వృద్ధులు, 591 మంది విభిన్న ప్రతిభావంతులు మొత్తం 904 మంది హోం ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. శనివారం, ఆదివారాల్లో జరిగిన హోం ఓటింగ్‌లో వృద్ధులు 164 మంది, విభిన్న ప్రతిభావంతులు 340 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులు హోం ఓటరు వద్దకు వెళ్లి పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల మధ్య వారి ఓటు వినియోగించుకున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు హోం ఓటింగ్‌ కొనసాగనుంది.

ఇల్లే పోలింగ్‌ కేంద్రం...

డోన్‌ టౌన్‌/బనగానపల్లె రూరల్‌: వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు ఓటు హక్కు వినియోగం కోసం ఇంటినే పోలింగ్‌ కేంద్రంగా మార్చేశారు. రహస్య ఓటింగ్‌ ప్రక్రియ దెబ్బతినండా, నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. డోన్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మహేశ్వరరెడ్డి ఆదివారం ఉదయం డోన్‌ పట్టణంలో హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఇళ్లకు నోడల్‌ అధికారి శ్రీనివాసులు, సెక్టోరల్‌ అధికారి అబ్దుల్‌ షఫితో పాటు ప్రైసెడింగ్‌ అధికారులు, అసెంబ్లీ స్థాయిలో మాస్టర్‌ ట్రైనర్స్‌, మైక్రో అబ్జర్వర్స్‌ ఓపీఓలు, వీఆర్వోలు, బూత్‌ లెవల్‌ సిబ్బంది పాల్గొన్నారు. బనగానపల్లె నియోజవర్గంలో మొత్తం 158 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 65 మంది తమ ఓటు హక్కును ఇంటి వద్దనే వినియోగించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కామేశ్వరరావు తెలిపారు.

నియోజకవర్గం హోమ్‌ ఓటేసిన వారు

వృద్ధులు దివ్యాంగులు, రోగులు

ఆళ్లగడ్డ 28 153

శ్రీశైలం 15 10

నందికొట్కూరు 57 69

నంద్యాల 19 22

బనగానపల్లె 24 41

డోన్‌ 21 45

మొత్తం 164 340

ఇంట్లోనే ఓటేశారు
1/1

ఇంట్లోనే ఓటేశారు

Advertisement
Advertisement