త్వరగా పూర్తిస్థాయి సేవలందించాలి
కర్నూలు నగరంలో రాష్ట్రస్థాయి స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు కావడం ఎంతో ఆనందకరం. ఇలాంటి ఆసుపత్రి సేవలను ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత సమాజంలో మారిన జీవనశైలి కారణంగా చాలా మంది ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ మేరకు ప్రజల ఆహార, విహారాల్లో మార్పులు చేసుకునేలా సూచనలు చేయాలి. క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజలను చైతన్యపరచాలి. ఇది ఒక్క వైద్యులతోనే సాధ్యం అవుతుంది. ఒకవైపు వైద్యం చేస్తూనే మరోవైపు అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలి.
– డాక్టర్ ద్వారం ప్రభాకర్‌రెడ్డి,
ఆయుర్వేద వైద్యులు, కర్నూలు
ప్రభుత్వం వెంటనేవసతులు కల్పించాలి
రాష్ట్ర విభజన అనంతరం ఎక్కడో ఏర్పాటవుతుందనుకున్న స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను కర్నూలులో ఏర్పాటైన ప్పుడు అందరూ సంతోషించారు. అయితే ఇది ప్రారంభమై 8 నెలలైనా ఇప్పటికీ పూర్తిస్థాయిలో సేవలు కొనసాగకపోవడం బాధాకరం. ఇది పూర్తిస్థాయిలో సేవలు అందిస్తే రాయలసీమతో పాటు తెలంగాణా, కర్ణాటక రాష్ట్ర ప్రజలకు సైతం ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం క్యాన్సర్ ఎంతో ఖరీదైన జబ్బుగా మారింది. దీనికి చికిత్సను పేదలు, మధ్యతరగతి ప్రజలు భరించేస్థితిలో లేరు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుని అన్ని వసతులు, సౌకర్యాలు, పరికరాలతో పూర్తిస్థాయిలో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో సేవలు అందించే ఏర్పాటు చేయాలి.
– ఎ. వెంకట్, మెడికల్ రెప్, కర్నూలు
●
Comments
Please login to add a commentAdd a comment