నంద్యాల: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,645 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలియడంతో డీఎడ్, బీఎడ్ చేసిన 40వేలకు పైగా మంది అభ్యర్థులు ఆశలు పెంచుకున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూశారు.తాను అధికారంలోకి రాగానే డీఎస్సీ పోస్టుల భర్తీ చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. దీంతో పలువురు నంద్యాల, కర్నూలు, విజయవాడ, అవనిగడ్డ, తిరుపతి వంటి పట్టణాలకు కోచింగ్‌కు వెళ్లారు. వీరిని నమ్మించేందుకు మరోసారి హడావుడిగా టెట్ నిర్వహించారు. తర్వాత ఈ పరీక్ష ఫలితాలు విడుదలైన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించారు. టెట్ ఫలితాలు విడుదలై 15 రోజులు దాటినా నోటిఫికేషన్ రాలేదు. వేలకు వేలు ఖర్చు పెట్టుకొని నెలల తరబడిగా కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.
ఎస్సీవర్గీకరణ పూర్తయ్యే వరకు
నోటిఫికేషన్ ఉండదా?
డీఎస్సీ నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ పూర్తయిన అనంతరం విడుదల చేస్తామని మంత్రి లోకేష్ చెప్పినట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు పత్రిక ముఖంగా ప్రకటించారు. అంతేగాకుండా ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ సైతం వర్గీకరణ పూర్తయ్యే వరకు నోటిఫికేషన్ విడుదల చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అధికారంలోకి రాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిన కూటమి సర్కారు ఇప్పుడు కావాలనే కాలయాపన చేస్తోందని డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన తీర్పు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే కమిషన్ వేయగా ఏపీ ప్రభుత్వం మాత్రం రెండు రోజుల క్రితం రిటైర్డు ఐఏఎస్ అధికారి రాజీవ్‌రంజన్ మిశ్రాతో కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదిక రెండు నెలల్లోగా ఇవ్వాలని గడువు విధించింది. ఆ సమయంలోగా నివేదిక ఇచ్చినా చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని నెలలకు వర్గీకరణ చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఈ తరుణంలో అసలు డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే విద్యాసంవత్సరం నాటికి విడుదల చేయడం కూడా కష్టమేనని కొందరు చెబుతున్నారు. అన్ని పనులు మానుకొని వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటూ శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు ఆర్థికంగా మరింత ఇబ్బందులు పడకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో స్పష్టమైన తేదీని ప్రకటించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగుల
జీవితాలతో బాబు చెలగాటం
అధికారంలోకి వచ్చి
ఆరునెలలవుతున్నా కాలయాపనే
నోటిఫికేషన్‌పై నేటికీ కొరవడిన స్పష్టత
జిల్లాలో వేలాది మంది అభ్యర్థుల
ఎదురు చూపు
ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు
డీఎస్సీ ఉండదని ప్రచారం
ఇప్పటికే కోచింగ్ కోసం
వేలాది రూపాయలు ఖర్చు
2,645
ఉమ్మడి కర్నూలు జిల్లాలో
మొత్తం డీఎస్సీ పోస్టులు
40,000
నోటిఫికేషన్ కోసం
ఎదురుచూస్తున్న అభ్యర్థులు
రూ. 50 వేలు
ఒక్కో అభ్యరి శిక్షణ,
హాస్టల్ ఇతర వాటి ఖర్చు మొత్తం
Comments
Please login to add a commentAdd a comment