వాటర్ గ్రిడ్ పనులు వేగవంతం చేయండి
పాణ్యం/బేతంచెర్ల: గోరుకల్లు రిజర్వాయర్ నుంచి 6 మండలాల్లో 138 గ్రామాలకు తాగునీరు అందించేందుకు చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. బేతంచెర్ల మండల పరిధిలోని బుగ్గానిపల్లె తండా వద్ద ఉన్న నీటి శుద్ధి ప్లాంట్‌ను బుధవారం ఆమె పరిశీలించారు. పనుల పురోగతిపై మెగా సంస్థ ప్రతినిధులతో చర్చించారు. పనులకు ఎక్కడా అవాంతరాలు జరగకుండా ఆర్ డబ్ల్యూఎస్, రెవెన్యూ అధికా రులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం వాటర్ గ్రిడ్ పథకం ద్వారా బేతంచెర్ల పట్టణానికి తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే మార్చి నాటికి డోన్ అర్బన్, రూరల్‌కు తాగునీరు అందించే పనులు పూర్తి కావాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ మనోహర్, డీఈ సోమశేఖర్ , మెగా సంస్థ ప్రాజెక్టు మేనేజర్ వాసు, డోన్ ఆర్డీఓ నరసింహులు పాల్గొన్నారు.
గోరుకల్లు జలాశయం పరిశీలన
పాణ్యం మండల పరిధిలోని గోరుకల్లు జలాశయాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సుభకుమార్‌తో నీటి నిల్వల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత వాటర్ గ్రిడ్ పథకం కింద నిర్మించిన గోరుకల్లు–డోన్ పైపులైన్ పనులను పరిశీలించారు. ఇన్‌టెల్ వద్ద ప్రాజెక్టు రూపకల్పనను తిలకించారు. కలెక్టర్ వెంట డీఈఈ జ్యోతి, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు.
ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి
నంద్యాల: ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఏపీఓ, ఎంపీడీఓలను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐిసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉపాధి హామీ లక్ష్యాలు, ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించడంలో పగిడ్యాల, కొత్తపల్లి, ఆత్మకూరు, డోన్, బేతంచెర్ల తదితర మండలాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయని చెప్పారు. గ్రామానికి రెండు చొప్పున ఫాంపాండ్స్, మండలానికి పది చొప్పున ఫిష్ పాండ్స్, రూప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలన్నారు. అలాగే జిల్లాలో గృహ నిర్మాణాల పనులు ముమ్మరం చేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. మావేశంలో డ్వామా పీడీ జనార్దన్ రావు, హౌసింగ్ పీడీ వెంకటసుబ్బయ్య, ఈఈ హరిహర గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
పైపు లైన్ పనుల పరిశీలనలో
జిల్లా కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment