స్టాంపుల కౌంటర్ ఏర్పాటు
ఆళ్లగడ్డ: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపులు విక్రయించేందుకు ప్రత్యేక కౌంటర్ తెరిచారు. జిల్లాలో స్టాంపు పేపర్ల బ్లాక్ దందాపై ఈ నెల 15వ తేదీన ‘అక్రమాలకు స్టాంపు’ శీర్షికన సాక్షి ప్రచురించిన ప్రత్యేక కథనంపై అధికారులు స్పందించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన స్టాంపులను వాటిపై ఉన్న ధరకే విక్రయిస్తున్నారు. గత కొన్ని మాసాలుగా స్టాంప్ వెండర్లు కృతిమ కొరతను సృష్టించి స్టాంప్‌ల ధరను పది రెట్లు పెంచి విక్రయించారు. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడిన ప్రజలకు ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయంలోనే సరసమైన ధరలకే స్టాంపులు దొరుకుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ చైతన్య రాయలు మాట్లాడుతూ స్టాంపులు కావలసిన వారు కార్యాలయంలో తీసుకోవాలన్నారు. వెండర్లు కూడా స్టాంపులపై ఉన్న ధరకే విక్రయించాలని, అధికంగా వసూలు చేసినట్లు పిర్యాదులు వస్తే వెంటనే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment