డీఎస్సీ కోసం కుటుంబానికి దూరంగా ..
ఈమె పేరు దుర్గాభవాని. రాజమండ్రి పట్టణానికి చెందిన ఈమె ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం చేస్తుండేది. టెట్ ఫలితాల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించడంతో నమ్మింది. ప్రైవేట్ ఉద్యోగం వదిలేసి భర్త, కుటుంబ సభ్యులను ఒప్పించి డీఎస్సీ శిక్షణ కోసం నంద్యాలకు వచ్చింది. ఇక్కడ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. టెట్ ఫలితాలు విడుదలైనా నోటిఫికేషన్ వెలువడకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతుంది.
బాబును నమ్మి.. 50 వేలు ఖర్చు చేసుకొని
ఇక్కడ కనిపిస్తున్న యువకుడి పేరు హనుమంత్ నాయక్. సత్యసాయి జిల్లా కదిరి పట్టణం. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డీఎస్సీపై తొలి సంతకం చేయడంతో ఆశతో ఉన్న ప్రైవేట్ ఉద్యోగాన్ని వదిలేసి కోచింగ్ కోసం నంద్యాలకు వచ్చాడు. నాలుగు నెలల నుంచి ఇక్కడి ఓ ప్రైవేటు హాస్టల్‌లో శిక్షణ తీసుకుంటూ ఈ నెల 6వ తేదీన నోటిఫికేషన్ వస్తుందని గట్టిగా నమ్మాడు. ప్రస్తుతం ఆ ఊసే లేకపోవడంతో కోచింగ్, హాస్టల్‌కు ఇప్పటికే రూ. 50 వేలు ఖర్చు అయ్యాయని..ఇంకా ఎన్ని నెలలు ఎదురుచూడాలోనని వాపోతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment