5 నెలలుగా కోచింగ్
చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీపై పెట్టడంతో ఏం ఆలోచించకుండా వెంటనే కోచింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నా. నంద్యాలలో డీఎస్సీ కోచింగ్ బాగుంటుందని స్నేహితులు చెప్పడంతో ఇక్కడికి వచ్చాను. నెలకు రూ.5వేలు చొప్పున ఐదునెలలుగా హాస్టల్‌లో ఉంటున్నాను. డీఎస్సీ కోచింగ్‌కు రూ.14వేలు కట్టాను. మొత్తం ఇప్పటి వరకు రూ.50 వేలవరకు ఖర్చు అయ్యింది. డీఎస్సీ ఊసే లేదు. ఎన్ని నెలలు ఇక్కడ ఉండాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం స్పందించి డీఎస్సీ నోటిఫికేషన్‌ను త్వరగా విడుదల చేయాలి.
–చంద్రకాంత్, రాచర్ల, ప్రకాశం జిల్లా
నోటిఫికేషన్ విడుదల చేయాలి
డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. సొంత ఊర్లు వదిలి ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటున్నాం. వేలాది రూపాయలు కోచింగ్‌లు, హాస్టళ్లకు ఖర్చు అవుతు న్నాయి. ప్రభుత్వం ఇప్పటివరకు నోటిఫికేషన్‌పై స్పష్టత ఇవ్వడం లేదు. వాయిదాల మీద వాయిదా లు వేస్తోంది. నంద్యాలలో గత మూడు నెలలుగా నేను కోచింగ్ తీసుకుంటున్నా. ఎన్ని నెలలు కోచింగ్ సెంటర్‌లో ఉండాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు మాట ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి హామీని నెరవేర్చుకోవాలి.
–లీలావరలక్ష్మి, బద్వేల్, వైఎస్సార్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment