‘పది’ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
నంద్యాల(న్యూటౌన్): ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో పట్టణంలోని టెక్కె పురపాలక ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పదవ తరగతి సిలబస్, ఫలితాల పెంపు, మధ్యాహ్న భోజనం తదితర వాటిపై ఉపాధ్యాయులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి టీచర్ అర్థవంతంగా విద్యాబోధన చేసి వందశాతం ఫలితాల సాధనకు కృషి చేయాలన్నారు. ఎవరైనా విధులకు డుమ్మా కొడితే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ బ్రహ్మంనాయక్, సీఆర్పీలు పాల్గొన్నారు.
పనుల్లో నాణ్యత తప్పనిసరి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థాన సిబ్బందికి సున్నిపెంటలో నిర్మిస్తున్న వసతి గృహనిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పరిపాలనాంశాల్లో భాగంగా పలు ఇంజినీరింగ్ పనులను పరిశీలించారు. ముందుగా సున్నిపెంటలో నిర్మిస్తున్న వసతి గృహాలను పరిశీలించారు. జంగిల్ క్లియరెన్స్, సంప్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పిల్లలు అడుకునేందుకు వీలుగా వసతిగృహాల వద్ద అటస్థలం కూడా ఉండాలన్నారు. హఠకేశ్వరం వద్ద భక్తులు సేదతీరేందుకు యాత్రిక షెడ్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. శౌచాలయాలు, స్నానపుగదులు, జల్లుస్నానం ఏర్పాటు చేయాలని అన్నారు. నీటిగుండం చుట్టు కటాంజనాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం గణేశసదనంను పరిశీలించారు. ఆయన వెంట ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ ఎం.నరసింహారెడ్డి, డీఈఈ చంద్రశేఖరశాస్త్రి, సుబ్బారెడ్డి, ఏఈలు పాల్గొన్నారు.
జిందాల్ ఫ్యాక్టరీకి పొడి చెత్త
నంద్యాల(న్యూటౌన్): నంద్యాల పురపాలక సంఘం పరిధిలోని కంపోస్టు యార్డు నుంచి పొడి చెత్తను జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీకి అందజేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డి తెలిపారు. బుధవారం కంపోస్టు యార్డును పరిశీలించిన ఆయన పొడి చెత్తను తీసుకెళ్లేందుకు కంపెనీ యాజమాన్యం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. సమావేశంలో మున్సిపల్ ఇంజినీర్ డీఈ రసూల్, శానిటేషన్ సూపర్‌వైజర్ మురళీధర్, జిందాల్ ఫ్యాక్టరీ ఏజీఎం అన్వేష్, సీనియర్ మేనేజర్ గోపి, తదితరులు పాల్గొన్నారు.
అన్నదానం మిన్న
ఆళ్లగడ్డ: అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని అహోబిలం దేవస్థానం ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాలన్ అన్నారు. దిగువ అహోబిలం దేవాలయ ప్రాంగణంలో బుధవారం రంగారావు గోష్టి వారి ఆధ్వర్యంలో కార్తీకమాసం అన్నదానం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధానార్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రంగారావు గోష్టి సభ్యులు పెనముర్తి ప్రసాదారావు, రవికాంత్ చౌదరి, హిమబిందు, ఉప్పల ప్రసాద్, వీరచంద్ర తదితరులున్నారు.
జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా మల్లీశ్వరి
బొమ్మల సత్రం: నంద్యాల జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా మల్లీశ్వరి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పులివెందుల జీజీ హెచ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఈమెను ఉన్నతాధికారులు ఇటీవల ఇక్కడికి బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన కొంత సేపటికే ఆమె తిరిగి సెలవులపై వెళ్లిపోయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment