నాలుగు నెలలుగా అందని బిల్లులు
అంగన్‌వాడీ కేంద్రాలకు నాలుగు నెలల నుంచి కూరగాయలు, నిత్యావసర సరుకులు, గ్యాస్ బిల్లులు అందటం లేదు. గత కొన్ని నెలల నుంచి మార్కెట్‌లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వం పాత బిల్లులను అందజేస్తుండటంతో మధ్యాహ్న భోజన పథక నిర్వహణ భారంగా మారింది. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని మెనూ చార్జీలను పెంచడంతో పాటు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి.
– వెంకటలక్ష్మి, అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, కోవెలకుంట్ల
బలోపేతం చేయాలి
జిల్లాలో పూర్వప్రాథమిక విద్యను అందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలి. కేంద్రాల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి. సొంత భవనాలు లేని అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలి. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి.
– సుధాకర్, సీఐటీయూ నాయకుడు, కోవెలకుంట్ల
Comments
Please login to add a commentAdd a comment