శ్రీశైలం నుంచి 11,596 క్యూసెక్కుల నీరు విడుదల
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైల జలాశయం నుంచి ఆదివారం దిగువ ప్రాజెక్ట్‌లకు 11,596 క్యూసెక్కుల నీరు విడుదలచేశారు.విద్యుత్‌ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 6,666 క్యూసెక్కులు, బ్యాక్‌వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీకి 1,500 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతి ద్వార మల్యాల ఎత్తిపోతలకు 1,630 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు 120 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 3.198 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. పంప్‌మోడ్ ఆపరేషన్‌తో 5,195 క్యూసెక్కుల నీటిని జలాశయంలోకి మళ్లించారు.ఆదివారం సాయంత్రం సమయానికి జలాశయంలో 114.2356 టీఎంసీల నీరు నిల్వ ఉంది.డ్యాం నీటిమట్టం 862.60 అడుగులకు చేరుకుంది.
కేసీలో భారీగా తగ్గిన నీటి ప్రవాహం
జూపాడుబంగ్లా: కేసీ కాల్వలో నీటి సరఫరా భారీగా తగ్గింది. దీంతో నిప్పులవాగు, ఏబీఆర్ కాల్వలకు సాగునీటి సరఫరా నిలిపివేసినట్లు కేసీ కాల్వ ఏఈ శ్రీనివాసనాయక్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుంకేసుల డ్యాం నుంచి కేసీ కాల్వకు 600 క్యూసెక్కులు, మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా 340క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. రైతుల సౌకర్యార్థం లాకిన్స్‌లాకు 336 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు తెలిపారు. ఈ నీటిని నేరుగా తూడిచెర్ల సబ్‌చానల్ కాల్వకు మళ్లిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment