నల్లమల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్
మహానంది: నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే నల్లమల ఘాట్ రోడ్డులో ఆదివారం ట్రాఫిక్ జాం అయింది. నంద్యాల నుంచి గిద్దలూరు వైపు వెళ్తున్న ఓ లారీకి యాక్సిల్ కట్ అవడంతో నిలిచిపోయింది. అదే సమయంలో అధిక లోడ్‌తో వెళ్తున్న మరో లారీ పురాతన వంతెన సమీపంలో మలుపు వద్ద వెళ్లలేక ఆగిపోయింది. దీంతో సుమారు మూడున్నర గంటల పాటు ట్రాఫిక్ జాం కావడంతో ఇరువైపులా వందల సంఖ్యలో పెద్ద పెద్ద వాహనాలు ఆగిపోయాయి. భవానీదీక్ష స్వీకరించిన భక్తులు విజయవాడ వెళ్లేందుకు గంటలకొద్ది నిరీక్షించారు. ట్రాఫిక్‌జామ్ విషయం తెలుసుకున్న గిద్దలూరు, మహానంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మరమ్మతులకు గురైన లారీని పక్కకు తప్పించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయని ప్రయాణికులు తెలిపారు.
మూడున్నర గంటలు నిలిచిన వాహనాలు
Comments
Please login to add a commentAdd a comment