దూరమైన ‘సంక్షేమం’
కాల చక్రంలో 2024 సంవత్సరం మరి కొద్ది గంటల్లో కరిగిపోతుంది. జిల్లా ప్రజలకు ఈ ఏడాది తొలి ఆర్నెల్లు ఆనందం.. ఆర్నెల్లు ఆందోళనలు మిగిల్చింది. జననేత వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాలు అందుకుని ఆనందాలతో జీవనం సాగించారు. అంతలోనే ప్రభుత్వం మారిపోగా అన్ని వర్గాలకు అవస్థలు తోడయ్యాయి. వ్యవసాయం నష్టాలు మిగిల్చింది. సంక్షేమ పథకాలు దూరమయ్యాయి. అభివృద్ధి నిలిచిపోయింది. అన్ని వర్గాల్లో ఆందోళన మొదలైంది. కూటమి పాలకులు హామీలు వల్లె వేస్తున్నారే కాని ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు. అంతలోనే ఎంత మార్పు అంటూ ఈ ఏడాదిలో చోటు చేసుకున్న సంఘటనలను జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. – నంద్యాల
కూటమి పాలనలో దూరమైన
సంక్షేమం,
అభి వృద్ధి
చివరి
ఆర్నెల్లలో
ఆశలన్నీ
ఆవిరి
మొదటి మూడునెలలు జిల్లా ప్రగతి పథం
తీపి,చేదు
జ్ఞాపకాలు
మిగిల్చిన 2024
ఆందోళన
బాట పట్టిన
అన్ని వర్గాలు
అధికారం కోసం ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అనేక హామీలు గుప్పించారు. సూపర్ సిక్స్ పేరుతో యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు రూ. 3 వేల నిరుద్యోగభృతి, అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ. 20 వేలు సాయం, తల్లికి వందనం కింద ఏడాదికి ఒక్కొ విద్యార్థికి రూ. 15 వేలు, ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ1500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏటా ప్రతి కుటుంబానికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పారు. అధికారం చేపట్టి ఆరునెలలు గడిచినా ఇందులో ఇప్పటి వరకు ఏ ఒక్కటీ అమలు కాలేదు. కేవలం ఒక్క సిలిండర్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలోనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఉండేదని కూటమి ప్రభుత్వంలో గొప్పలు తప్ప హామీల అమలు లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment