యథేచ్ఛగా కొనసాగుతున్న విక్రయాలు
జిల్లాలో సారా విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతుండటం పోలీసుల దాడుల్లో నమోదవుతున్న కేసులను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. కొండ ప్రాంతాల్లో సారా తయారీకి బట్టీలు ఇష్టానుసారంగా తెరుకోవటంపై పోలీసులను నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. గ్రామాల్లో సారా విక్రయాలు పక్కనపెడితే ఏకంగా జిల్లా కేంద్రంలో సారా విక్రయాలు జరగుతున్నా పట్టించుకోకపోవటం గమనార్హం. జిల్లా ఎకై ్సజ్ పోలీస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఏకలవ్య నగర్, దేవనగర్, బొగ్గులైన్, బొమ్మలసత్రం లాంటి ప్రాంతాల్లో నేటికీ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే జిల్లా కేంద్రంలో వన్‌టౌన్ పోలీస్టేషన్‌కు వెనుక ఉన్న హరిజన వాడలో కూడా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సమీపంలోని కుందూనది ప్రాంతంలో సారా బట్టీల నుంచి సారా తయారు చేసి హరిజనవాడకు చెందిన ఒక కూటమి నాయకుడి అండతో ప్రతి రోజు విక్రయాలు జరుపుతున్నారు. ఫిర్యాదులు అందినప్పుడుమాత్రమే తూతూ మంత్రంగా దాడులు చేసి 10 నుంచి 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం చేసుకోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
సారా విక్రయిస్తే
కఠిన చర్యలు తప్పవు
జిల్లాలో నాటుసారా స్థావరాలపై ప్రత్యేక నిఘా ఉంచి బట్టీలను ధ్వంసం చేస్తున్నాం. నాటుసారా తయారు చేసినా లేదా విక్రయించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. కేవలం 6 నెలల వ్యవధిలో దాదాపుగా 350 కిపైగా కేసులు నమోదు చేశాం. ఎవరైనా సారా విక్రయాలు జరిపితే వెంటనే స్థానిక ఎకై ్సజ్ పోలీసులకు సమాచారం అందించాలి.
– రవికుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్,
నంద్యాల జిల్లా
Comments
Please login to add a commentAdd a comment