అమ్మాయి తరఫు వారే చెడగొడుతున్నారు
నేను పాతికేళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నా. మొదట్లో అమ్మాయి ఫొటో చూసి, ఆ తర్వాత వివరాలు కనుక్కుని వెంటనే మాట్లాడుకుని పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. ఎన్ని సంబంధాలు చూపినా అమ్మాయి వారికి నచ్చడం లేదు. అమ్మాయిలు చదువుకున్న వారైనందున డిమాండ్స్ పెరిగాయి. ఒక విధంగా వివాహాలు ఆలస్యం కావడానికి అమ్మాయి తరఫు వారే కారణం.
–డి.చిన్నయ్య, మ్యారేజ్ బ్యూరో, కర్నూలు
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే
కావాలంటున్నారు
నేను 15 సంవత్సరాలుగా మ్యారేజ్ బ్యూరోగా పనిచేస్తున్నా. ఉన్నత వర్గాల నుంచి పేదల వరకు అందరూ అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయి ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో పాటు పెళ్లి అయిన తర్వాత అమ్మాయి, అబ్బాయి వేరు కాపురం ఉంటారని, అత్తామామలు వారితో ఉండకూడదని కోరుకుంటున్నారు. ఆస్తిపాస్తులు లేవని చాలా సంబంధాలు వెనక్కి పోతున్నాయి.
–లక్ష్మీనరేష్, మ్యారేజ్‌బ్యూరో, కర్నూలు
పట్టింపులు వీడాలి
పెళ్లిళ్లు కావాలంటే అమ్మాయి, అబ్బాయి తరఫు వారు పట్టింపులు వీడాలి. చదువు, హోదా ఉన్నా ఆస్తి పాస్తులు భారీగా ఉండాలని, ఇంట్లో అత్తామామలు, తోడికోడళ్లు, ఆడబిడ్డలు కూడా ఉండకూడదని చెబుతున్నారు. కుటుంబమన్నాక ఇంట్లో తల్లిదండ్రులు, యువజంటలు, వారి పిల్లలు ఉండాలి. అప్పుడే అనుబంధాలు, ఆప్యాయతలు అందరికీ అర్థం అవుతాయి. ఇవేమీ లేకుండా విలువైన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. –బి. శివప్రసాద్, కోడుమూరు
●
Comments
Please login to add a commentAdd a comment