మూడో రోజు 204 మంది ఎంపిక
కర్నూలు: కానిస్టేబుల్ నియామకానికి సంబంధించిన దేహదారుఢ్య పరీక్ష ప్రక్రియ గురువారం మూడో రోజుకు చేరింది. 600 మంది అభ్యర్థులకు గాను 283 మంది బయోమెట్రిక్‌కు హాజరయ్యారు. అభ్యర్థుల అర్హత పత్రాల పరిశీలన, బయోమెట్రిక్, శారీరక కొలతలు పరిశీలించారు. అందులో అర్హత సాధించిన వారికి 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. వాటిలో 204 మంది ప్రతిభను కనపరచి తుది రాత పరీక్షకు ఎంపికయ్యారు. ఏదైనా సమస్యలు, కారణాలతో అప్పీల్ చేసుకున్న అభ్యర్థులు జనవరి 28న హాజరుకావాలని పోలీసు అధికారులు తెలిపారు.
నేడు మహిళా అభ్యర్థులకు...
3, 4 తేదీల్లో మహిళా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. రోజుకు 739 మంది చొప్పున హాజరుకానున్నాయి. బరువు 30 కిలోలు, ఎత్తు 150 సెం.మీ ఉండాలి. 1600 మీటర్ల పరుగును 10.30 నిముషాలు, 100 మీటర్ల పరుగును 18 సెకన్లు, లాంగ్‌జంప్ 2.75 మీటర్లు పూర్తి చేయాలి. వీటిలో ఉత్తీర్ణులైనవారు తుది రాత పరీక్షకు అర్హత సాధిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment