పిల్లల వివరాలు ప్రశస్త యాప్‌లో నమోదు చేయండి
నంద్యాల(న్యూటౌన్): ప్రత్యేక అవసరాలు పిల్లల వివరాలను ప్రశస్త యాప్‌లో నమోదు చేయాలని సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ప్రేమ్‌కాంత్ కుమార్ సూచించారు. భవిత సెంటర్ నిర్వహణ, పర్యవేక్షణపై జిల్లాలోని ఎంఈఓలకు గురువారం జిల్లా కేంద్రంలోని డిప్యూటీ ఈఓ కార్యాలయంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సదరన్ సర్టిఫికెట్ పొందే విధానం, ప్రత్యేక అవసరాలున్న పిల్లల సర్వే చేసే విధానంపై వివరించారు. బడిబయట ఉన్న పిల్లలందరని బడిలో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినేటర్ మల్లికార్జున, జిల్లా కోఆర్డినేటర్ రఘురామిరెడ్డి, డాక్టర్ కాంతరావు పాల్గొన్నారు.
నేడు జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన
నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని ఎస్‌పీజీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రధర్శన ఉంటుందని జిల్లా సైన్స్ అధికారి సుందరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన 8, 9 తరగతుల విద్యార్థులు హాజరై భౌతిక, రసాయన, జీవశాస్త్రం, పర్యావరణం, కంప్యూటర్ విజ్ఞానం మోదలగు వినూత్న ఆలోచనలతో చక్కని సైన్స్ ప్రాజెక్టులు రూపొందించి ప్రదర్శించాలన్నారు. ప్రాజెక్టు తయారు చేసేటప్పడు పర్యావరణ రహిత వస్తువులు ఉపయోగించాలన్నారు.
5న జిలా స్థాయి పోటీలు
నంద్యాల(న్యూటౌన్): ఈనెల 5న శ్రీరామ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువజన సర్వీసుల శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సహకారంతో జిల్లాస్థాయి వ్యాస రచన, వక్తృత్వ, డ్రాయింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు సెట్కూరు ముఖ్యనిర్వహణ అధికారి దీప్తి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వామి వివేకానంద జీవిత సందేశంపై వ్యాసరచన, సమాజ నిర్మాణంలో యువత పాత్రపై వకృత్వం, డ్రగ్స్ వ్యసనం దాని ప్రభావాలపై డ్రాయింగ్, చిత్రలేఖనం పోటీలు ఉంటాయన్నారు. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు యువత పోటీల్లో పాల్గొనాలని, మరింత సమాచారం కోసం 9440516023 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని 11 మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. గురువారం దేవస్థాన పరిపాలన భవనంలోని ఈఓ చాంబర్‌లో పదోన్నతులు పొందిన ఉద్యోగులకు ధ్రువీకరణ పత్రాలను దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు అందజేశారు. పదోన్నతులు పొందిన వారిలో ఎన్.అనురాధ, ఎం.చంద్రశేఖరరెడ్డి, పి.తారకచంద్రశేఖర్, ఏ.శ్రీనివాసులు, జె.శ్రీనివాసరెడ్డి, కె.శ్రీనివాసప్రసాద్, కె.నాగేంద్ర, కె.వి.రమణ, ఎం.రామానాయుడు, పి.శ్రీవిద్య, సి.గోవిందమ్మ ఉన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఎం.రమణమ్మ, ఏఈఓ వెంకటేశ్వరరావు ఉన్నారు.
గుడి నిర్మాణానికి రూ.లక్ష విరాళం
డోన్ టౌన్: పట్టణ సమీపంలోని జాతీయ రహదారి వద్ద నిర్మిస్తున్న షిర్డీ సాయిబాబా గుడి నిర్మాణానికి కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఈడిగ లోకేశ్వరగౌడ్ గురువారం రూ.లక్ష విరాళం ఇచ్చారు. ముందుగా ఆయన ఆలయాన్ని సందర్శించి ఆలయ కమిటీ సభ్యులు భాష్యం రమణగౌడ్, ఓలేటి మాధవస్వామి, కందుకూరు పార్థు, సాయి, ధర్మారం సుబ్బారెడ్డి, సీఎం శ్రీను, మురళీకృష్ణగౌడ్, రామచంద్రుడులకు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు దాతను అభినందించి సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment