ఇస్తెమాకు పకడ్బందీ ఏర్పాట్లు
ఆత్మకూరు: పట్టణంలో జనవరి 7 నుంచి 9వ తేదీ వరకు జరిగే ఇస్తెమా కార్యక్రమం విజయవంతానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి ఆత్మకూరులో ఇస్తెమా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో తొలిసారిగా ఆత్మకూరు పట్టణంలో ఇస్తెమా ఏర్పాటు చేశామని, దీనికి దాదాపు 2 లక్షలకు పైగా ముస్లింలు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఇస్తెమాలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, పోలీసు శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అంతకుముందు ఆమె వైద్యశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రణాళిక లేకుండా ఉండటం సరికాదన్నారు. ఇస్తెమా కమిటీ సభ్యులు అనుమతిస్తే అన్నదానం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సమావేశంలో వివిధశాఖల అధికారులు, సిబ్బంది, ఇస్తెమా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
2 లక్షలకు పైగా ముస్లింలు
హాజరయ్యే అవకాశం
ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
అధికారులతో మంత్రి ఫరూక్
Comments
Please login to add a commentAdd a comment