ఆత్మకూరు: పట్టణంలో ఈనెల 7వ తేదీ నుంచి జరిగే ఇస్తెమాకు ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఇస్తెమా నిర్వహించే ప్రదేశంలో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. దాదాపు 2 లక్షలకు పైగా ముస్లింలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కర్నూలు నుంచి ఆత్మకూరుకు వచ్చే వాహనాలను పట్టణ శివారులోని ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్, గీతా హోటల్ తదితర ప్రాంతాల్లో నిలిపేందుకు పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. నంద్యాల నుంచి ఆత్మకూరు వచ్చే వాహనాలను వెలుగోడు ప్రధాన రహదారి పక్కన పార్కింగ్ చేయించాలన్నారు. మొత్తం రెండు వైపులా 17చోట్ల పార్కింగ్ ప్రదేశాలు ఉండాలన్నారు. ఎస్పీ వెంట ఆత్మకూరు డీఎస్పీ రామాంజీనాయక్, సీఐలు రాము, సురేష్‌కుమార్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వరప్రసాద్, చంద్రబాబుతో పాటు ఎస్‌ఐలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment