పది పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయండి
బనగానపల్లె : పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని జిల్లా సమగ్రశిక్ష ప్రాజెక్టు అడిషనల్ కో ఆర్డినేటర్(ఏపీసీ) ప్రేమంత్‌కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇల్లూరు కొత్తపేట జెడ్పీ హైస్కూల్‌తో పాటు స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో కనీస వసతుల గురించి ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం ఎంఈఓ కార్యాలయాన్ని సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష సిబ్బంది దస్తగిరిరెడ్డి, రఘురామిరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, ఎంఈఓలు స్వరూప, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment