కర్నూలు(సెంట్రల్/డోన్ రూరల్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విశాఖపట్నం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆర్‌ఎస్ పెండేకల్ – గుత్తి, డోన్ – మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులను మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే కాచిగూడ నుంచి మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ పనులు పూర్తయ్యాయి. డోన్ మహబూబ్‌నగర్ మధ్య ఈ పనులు పూర్తయితే రైలు ప్రయాణ సమయం తగ్గ నుంది. దాదాపు 150 కి.మీ ఉండగా 20 స్టేషన్లు ఉన్నా యి. ప్రస్తుతం ఈ మార్గం సింగిల్ లైన్ కావడంతో రైళ్లను క్రాసింగ్‌లకు ఆయా స్టేషన్లలో నిలిపివేయాల్సి వస్తోంది. డబ్లింగ్ పూర్తయితే క్రాసింగ్‌లు లేకపోవడంతో పాటు రైళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment