కళారంగంలో రాణించాలి
ఉయ్యాలవాడ: విద్యార్థులు చదువుతో పాటు కళారంగంలో రాణించాలని నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బోడెమ్మనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఉయ్యాలవాడ మోడల్‌స్కూల్‌ను ఆయన సందర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు చేసిన కోలాటం, చెక్క భజన, రింగు ఆట, కర్రసాము ప్రదర్శలను డీఈఓ తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటి వరకు ఉయ్యాలవాడ మండలంలోని బోడెమ్మనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏపీ మోడల్‌స్కూల్, నంద్యాల పట్టణంలో సెయింట్ జోసఫ్, చైతన్య, ఎల్‌కేఆర్ పాఠశాలలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అనంతరం స్థానిక మోడల్‌స్కూల్‌లో విద్యార్థుల పుట్టినరోజున మొక్కలు నాటించే కార్యక్రమాన్ని చేపడుతున్న తెలుగు ఉపాధ్యాయుడు దివాకర్, హిందీ ఉపాధ్యాయుడు నాగరాజును డీఈఓ అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment