నంద్యాల(న్యూటౌన్): అన్ని వాహనాలకు యజమానులు ఈనెల 31వ తేదీలోగా పన్ను చెల్లించాలని జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి శుక్రవారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. రవాణా శాఖకు సంబంధించి అన్ని సేవలను జాతీయ వెబ్‌సైట్ వాహన పోర్టల్‌లో vahan.privahan.nic.inలో పొందవచ్చని ఆమె తెలిపారు. పన్ను చెల్లించకపోతే రోడ్లపై తిరుగుతున్నప్పుడు జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. జాతీయ భద్రత మాసోత్సవాల్లో భాగంగా శనివారం నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఈఐ చెకప్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మహానందీశ్వరుడి భూములు అప్పగింత
● పట్టాదారు పాసుపుస్తకాలు
వెనక్కి ఇచ్చేసిన ఇనాందారులు
మహానంది: ఇనాందారుల నుంచి మహానందీశ్వరస్వామి దేవస్థానానికి చెందిన తమ్మడపల్లె గ్రామ పరిధిలోని 303 సర్వే నెంబరులో ఉన్న 8.74 ఎకరాల భూములు తిరిగి దేవస్థానానికి చేరాయని ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో ఇన్‌చార్జ్ తహసీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో ఇనాందారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 8.74 ఎకరాల భూములను అనకల ఇనాం సర్వీస్ కింద ఇస్తే నలుగురు అన్నదమ్ములు నాగమోహన్, వెంకటసుబ్బయ్య, అనకల సుబ్బరాయుడు, మరొకరు పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకున్నారన్నారు. అయితే తాము కేవలం పంట నష్టపరిహారాలు, ప్రభుత్వం నుంచి అందేసాయం కోసం మాత్రమే తీసుకున్నామని చెప్పగా ఇన్‌చార్జ్ తహసీల్దార్ రమాదేవి కౌలుకార్డులు తీసుకుంటే వస్తాయన్నారు. అప్పగించిన పట్టాదారు పాసుపుస్తకాలను రద్దు చేసేందుకు జాయింట్ కలెక్టర్‌కు పంపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు సర్కిల్ ఎస్‌ఈగా ద్వారకానాథ్ రెడ్డి
కర్నూలు (సిటీ): జలవనరుల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుకు పర్యవేక్షక ఇంజినీర్లుగా పదోన్నతులు లభించాయి. ఇందులో భాగంగా కర్నూలు సర్కిల్ ఎస్‌ఈగా ద్వారకానాథ్ రెడ్డిని నియమిస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయిప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ పర్యవేక్షక ఇంజినీర్‌గా రెగ్యులర్ అధికారి లేకపోవడంతో డిప్యూటీ ఎస్‌ఈగా పనిచేస్తున్న బాలచంద్రారెడ్డి ఇన్‌చార్జ్ పనిచేస్తున్నారు. తెలుగుగంగ కడప సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ పర్యవేక్షక ఇంజినీర్‌గా పనిచేస్తున్న ద్వారకానాథ్ రెడ్డిని రెగ్యులర్ ఏస్‌ఈగా నియమించారు. ఈయన ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పదవీ విరమణ పొందనున్నారు. అలాగే తెలుగుగంగ పర్యవేక్షక ఇంజినీర్‌గా ఎన్.శివప్రసాద్‌రెడ్డిని నియమించారు. ఈయన ప్రస్తుతం జలవనరుల శాఖ విజయవాడ కార్యాలయంలో ఈఈగా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment