No Headline
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు 11రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నామని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం దేవస్థాన పరిపాలనా భవనంలో సమీక్ష నిర్వహించారు. దేవస్థానం యూనిట్ , ఇంజినీరింగ్ అధికారులు, పర్యవేక్షకులు, వైదిక కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి రెండో వారంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లన్నీ పూర్తికావాలన్నారు. ఫిబ్రవరి 26న జరిగే ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం, ఆ మరునాడు జరిగే రథోత్సవం, తెప్పోత్సవానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పాదయాత్రతతో వచ్చే భక్తుల సౌకర్యార్థం నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కై లాసద్వారం, సాక్షిగణపతి వద్ద ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్నారు. శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ఉండాలని, జ్యోతిర్ముడి సమర్పణకు ఏర్పాట్లు చేయాలన్నారు. దర్శనానికి వేచిఉండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందజేయాలని సూచించారు. ఈ నెలాఖరుకల్లా మూత్రశాలలు, మరుగుదొడ్లకు మరమ్మతులను పూర్తి చేయాలన్నారు. అవకాశం మేరకు క్షేత్ర పరిధిలో అదనపు కుళాయిలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్.రమణమ్మ, స్వామివారి ఆలయ ప్రధానార్చకులు వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు ఎం.ఉమానాగేశ్వరశాస్త్రి, అధ్యాపక ఎం.పూర్ణానంద ఆరాధ్యులు, ఈఈ ఎం.నరసింహారెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, సహాయ ఇంజినీర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment