ఆ.. ఆకలి.. ఊ.. ఊరు వదిలి !
ఆత్మకూరు పట్టణంలో ఓ హోటల్ వద్ద టిఫిన్ చేస్తున్న ఈ పిల్లలను చూస్తుంటే సంక్రాంతి సెలవుల్లో శ్రీశైలమో.. మహానంది క్షేత్రాలకో వెళ్తూ మార్గమధ్యలో ఆకలితో ఆగినట్లు అనిపిస్తుంది కదూ.. ఆ చిన్నారులకు ఇప్పుడు ‘సుగ్గి’ సెలవులు.. అదేంటీ మరో రెండు రోజుల్లో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ముగుస్తుంటే ఈ సుగ్గి సెలవులు ఏంటని ఆశ్చర్యపోతున్నారా?. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాల్లో పనులు లేక పోవడంతో గుంటూరులో మిర్చి కోతలకు పిల్లాపాపలతో వ్యవసాయ కూలీలు, రైతులు వలస పోతున్నారు. ఆత్మకూరు మీదుగా రోజూ పదుల సంఖ్యలో కుటుంబాలు వలస వెళ్తున్నాయి. ‘ఊళ్లో పనుల్లేవు.. ప్రభుత్వం ఆదుకోవడం లేదు.. అమ్మఒడి.. రైతు భరోసా ఏమి ఇవ్వలేదు. ఎట్లా బతకాలి’.. అంటూ ఆలూరు మండలం బిల్లేకల్లుకు చెందిన రాజశేఖర్, సుంకన్న తదితరులు వాపోయారు.
– ఆత్మకూరురూరల్
Comments
Please login to add a commentAdd a comment