No Headline
● అశ్వవాహనంపై విహరించిన
ఆదిదంపతులు
● ముగిసిన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 11 నుంచి ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సమూర్తులను ఆలయ అలంకార మంపడంలోకి తోడ్కొని వచ్చి అశ్వవాహనంపై అధిష్టింపజేశారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామిఅమ్మవార్లకు ఆలయ ఉత్సవం నిర్వహించారు. అశ్వవాహనంపై విహరించిన స్వామిఅమ్మవార్లను పలువురు భక్తులు దర్శించుకున్నారు. సంక్రాంతి పర్వదినం రోజున నూతన వధూవరులైన పార్వతీ, మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామిఅమ్మవార్లకు 18 రకాల పుష్పాలు, 11 రకాల ఫలాలు నివేదించారు. శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. – శ్రీశైలంటెంపుల్
రమణీయం.. పుష్పోత్సవం
Comments
Please login to add a commentAdd a comment