‘భూములు లాగేసుకుంటారు.. వారసత్వంగా వచ్చిన భూములకు రీ సర
జిల్లాలో రీసర్వే జరిగే గ్రామాలు
మండలం రీసర్వే జరిగే గ్రామం
నంద్యాల కానాల
మహానంది తమ్మడపల్లె
గోస్పాడు ఎస్.కూలూరు
పాణ్యం గగ్గుటూరు
శిరివెళ్ల జీనేపల్లి
గడివేముల కొర్రపోలూరు
రుద్రవరం బీరవోలు
కొలిమిగుండ్ల కల్వటాల
ఉయ్యాలవాడ ఎస్.కొత్తపల్లి
సంజామల హోత్రమాన్‌దిన్నె
ఆళ్లగడ్డ గూబగుండం
దొర్నిపాడు అర్జునాపురం
చాగలమర్రి నీలంపాడు
ఆత్మకూరు ఇందిరేశ్వరం
బండి ఆత్మకూరు కడమలకాల్వ
కొత్తపల్లి బట్టువారిపల్లి
వెలుగోడు వేల్పనూరు
పగిడ్యాల పగిడ్యాల
మిడుతూరు దేవనూరు
జూపాడుబంగ్లా ఎనభైబన్నూరు
పాములపాడు కంబాలపల్లి
డోన్ యాపదిన్నె
బేతంచెర్ల బుగ్గానిపల్లె
ప్యాపిలి పెద్దపోడిల్లా
బనగానపల్లె నందవరం
అవుకు ఉప్పలపాడు
కోవెలకుంట్ల అమడాల
రీసర్వేతో ఆందోళన తీరింది
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మా గ్రామంలో రీ సర్వే జరిగింది. నా పేరు మీద సర్వే నెం.507లో 80 సెంట్ల మాగాని భూమి ఉన్నట్లు తేలింది. ఈ విస్తీర్ణానికి సంబంధించిన పత్రం కూడా నాకు ఇచ్చారు. హద్దుల్లో రాల్లోకటి పాతాల్సి ఉంది. ఎన్నికలు రావడంతో ఈ పని ఆగిపోయింది. రీసర్వే మంచిది కాదని ప్రచారం చేశారు. ఏదిఏమైనా జగన్ ప్రభుత్వంలో రీసర్వేతో నాకు పక్కాగా భూమి ఎంత ఉందో చెప్పి రికార్డుల్లో , పాస్ పుస్తకంలో నమోదు చేశారు. ఎలాంటి ఆందోళన లేకుండా ఈ భూమిలోనే పంటలు పండించుకుంటూ జీవనాధారం పొందుతున్నా. –దూదేకుల హుసేనమ్మ,
కానాల గ్రామం, నంద్యాల(మం)
రైతుల సమక్షంలో సర్వే
గతంలో ఎక్కడైతే రీసర్వే నిలిచిపోయిందో మళ్లీ అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. మండలానికో గ్రామాన్ని పైలట్‌గా ఎంపిక చేశాం. జిల్లాలో 28 గ్రామాల్లో రీసర్వే మొదటి విడతలో జరుగుతుంది. రైతుల సమక్షంలోనే రీసర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చాం. డ్రోన్ సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్ పనులు గతంలో మాదిరిగానే యథాతథంగా జరుగుతాయి.
– జయరాజు, జిల్లా సర్వే విభాగం అధికారి, నంద్యాల
నంద్యాల(అర్బన్)/కొలిమిగుండ్ల: తాము అధికారంలోకి వస్తే భూముల రీసర్వే చేయబోమని ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. వారిచ్చిన మాటపైనే వారికి నమ్మకం లేదో ఏమో.. భూ సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో చేపట్టిన రీసర్వేను కొనసాగించాలని నిర్ణయించారు. భూ సమస్యల పరిష్కారానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదని వారు గ్రహించి ఉంటారనే చర్చ రైతుల్లో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో వైఎస్సార్ జగనన్న భూ హక్కు భూరక్ష పథకం పేరు ఏపీ రీసర్వే ప్రాజెక్టు పేరుతో మార్చి ఈనెల 20వ తేదీ నుంచి మళ్లీ రీసర్వేను ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడి నుంచి అయితే రీసర్వే నిలిచిపోయిందో అక్కడి నుంచే తిరిగి ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2019–24 మధ్య సీఎంగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన రీసర్వే చరిత్రాత్మకం. ఈ సర్వేతో రైతుల సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు గుప్పించింది. ఏళ్లకు ఏళ్లుగా భూసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల ఎదుట బాధిత రైతులు బారులు తీరే వారు. వాటికి పరిష్కారం చూపడం అధికారులకు కష్టతరమైన పని. ఈక్రమంలో ఎప్పుడో నూరేళ్ల కింద బ్రిటీషు ప్రభుత్వ హయాంలో జరిగిన సర్వేను మళ్లీ సర్వే చేసి అన్నదాతలకు ఇబ్బంది లేకుండా చేయాలని అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా భూముల రీసర్వేతోపాటు రికార్డుల ఫ్యూరిఫికేషన్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో మొత్తం మూడు విడతల్లో 449 రెవెన్యూ గ్రామాలకుగాను 211 గ్రామాల్లో రీసర్వేను పూర్తి చేసి రెండు లక్షల మందికి పైగా రైతులకు భూ హక్కు పత్రాలు ఇచ్చింది. ఇంకా 238 గ్రామాల్లో రీసర్వే చేయాల్సి ఉండగా ఎన్నికలు జరగడంతో చరిత్రాత్మక ప్రాజెక్టు నిలిచిపోయింది.
వైఎస్సార్ జగనన్న భూ హక్కు..భూరక్ష పథకంపై ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు విషం చిమ్మారు. రైతుల భూములను సర్వే చేసే హక్కు ఎవరు ఇచ్చారని ఏక వచనంతో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూషించారు. అందుకు ఎల్లో మీడియా వంతపాడింది. టీడీపీ సోషల్ మీడియా లేనిపోని భయాందోళన ప్రజల్లో రేకెత్తించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రీసర్వేను మళ్లీ చేపట్టబోమని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అందరూ రీసర్వే జరగదని భావించారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ జగన్ సర్కారు చేపట్టిన రీసర్వే కొనసాగించేందుకు సీఎం చంద్రబాబునాయుడు పచ్చజెండా ఊపారు. ఈ క్రమంలో ఆనాడు ఎల్లో మీడియా, సోషల్ మీడియా చేసిన వ్యాఖ్యలు అబద్ధమని తెలిపోయింది.
మండలానికో పైలెట్ గ్రామం ఎంపిక
నేటి నుంచి రీసర్వే తిరిగి ప్రారంభం కానున్నది. వైఎస్సార్ జగనన్న భూ హక్కు–భూరక్ష పేరును ఏపీ రీసర్వే ప్రాజెక్టు పేరుతో మార్చి రీసర్వే చేయనున్నారు. మండలానికో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని రీసర్వే చేస్తారు. జిల్లాలోని 28 మండలాల్లో 28 గ్రామాలను రీసర్వే పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. ఇందుకోసం రీసర్వే డీటీలు, మండల సర్వేయర్లు, విలేజ్ సర్వేయర్లకు ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు. అయితే, రైతుల సమక్షంలోనే రీసర్వే జరగాలనే చిన్న మెలికను మాత్రం పెట్టారు. జిల్లాలో 28 గ్రామాల పరిధిలోని 95,136 ఎకరాల భూమిని 86 సర్వే బృందాలతో రీసర్వే చేస్తారు.
ఎన్నికల ముందు విషం చిమ్మి..
నేటి నుంచి మళ్లీ భూముల ‘రీసర్వే’
జగనన్న బాటలోనే కూటమి ప్రభుత్వం
నాడు ఎన్నికల్లో లబ్ధి కోసం
రాద్ధాంతం చేసిన వైనం
అధికారంలోకి వచ్చాక
తిరిగి రీ సర్వేకు పచ్చజెండా
గతంలో ఎక్కడ నిలిచిందో
అక్కడి నుంచే మొదలు
తొలుత జిల్లాలో
28 గ్రామాల్లో నిర్వహణ
రీ సర్వే చే సే
విస్తీర్ణం 95,136 ఎకరాలు
ప్రస్తుతం రీ సర్వే జరిగే ఊర్లు
28
రోవర్లు, ల్యాప్‌టాప్‌ల కొరత..
జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి చేపట్టనున్న రీ సర్వేకు 86మంది సర్వేయర్లను అధికారులు నియమించారు. ప్రతి సర్వే బృందానికి తప్పని సరిగా రోవర్, ల్యాప్‌టాప్‌లు ఉండాలి. అయితే, ప్రస్తుతం వాటి కొరత తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి స్థాయిలో రోవర్లు, ల్యాప్‌టాప్‌లు సమకూర్చుకోకుండా రీ సర్వే చేస్తే కచ్చితత్వం రాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ
పాలనలో రీ సర్వే
పూర్తయిన
గ్రామాలు
211
జిల్లా మొత్తం
భూ విస్తీర్ణం
16,98,307
ఎకరాలు
గత ప్రభుత్వంలో పూర్తైన
రీ సర్వే విస్తీర్ణం
6,03,487
ఎకరాలు
జిల్లాలో
రెవెన్యూ
గ్రామాలు
449
Comments
Please login to add a commentAdd a comment