ప్రతి గురువారం ‘స్వచ్ఛ శ్రీశైలం’
శ్రీశైలంటెంపుల్: ఇకపై ప్రతి గురువారం స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమం చేపట్టనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా ఏనుగుల చెరువు వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మన ఊరు–మనగుడి–మన బాధ్యత స్వచ్ఛంద సేవాసంస్థ నంద్యాల విభాగానికి చెందిన సుమారు 180మంది సేవకులు హాజరై పలుచోట్ల పరిశుభ్రత పనులు చేపట్టారు. అనంతరం ఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్ర పరిధిలో విస్త్రతంగా పారిశుద్ద్య పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేపడతామన్నారు. ఇలకైలాసాన్ని పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. స్వచ్ఛంద సేవకులకు ఈఓ వృక్ష ప్రసాదంగా ఊసిరి, బిల్వం మొక్కలు అందజేశారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ ఎం.నరసింహారెడ్డి, ఏఈఓ మల్లికార్జునరెడ్డి, ఉద్యానవన అధికారి లోకేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment