కోటకందుకూరులో పార్వేట
ఆళ్లగడ్డ: పార్వేట ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అహోబిలేశుడి మండలంలోని కోటకందుకూరు గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులు ఊరి పొలిమేర వద్దకు చేరి జ్వాలా నరసింహస్వామి, లక్ష్మీనరసింహాస్వాములు ఉత్సవ పల్లకీకి ఘనస్వాగతం పలికారు. తర్వాత ఉత్సవమూర్తులను గ్రామ తెలుపులపై కొలువుంచి పూజలు నిర్వహించారు. అహోబిలేశుడి రాకతో గ్రామంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది.
అపూర్వ సమ్మేళనం
మహానంది: గాజులపల్లె జిల్లా పరిషత్ పాఠశాల 2008–09 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీ య సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. 17 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారు చదువుకున్నప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు. నాడు చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించి తమ గురుప్రేమ చాటుకున్నారు.
కుంభాభిషేకానికి ముస్తాబు
కౌతాళం: కుంభాభిషేకానికి ఉరుకుంద ఈరన్నస్వామి క్షేత్రం ముస్తాబవుతోంది. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. క్షేత్ర పరిధిలో భక్తులకు ఇబ్బంది లేకుండా వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నారు. ప్రధాన అర్చ్‌గేట్‌కు ఇరువైపులా ఉన్న డివైర్లను తొలగించి చదును చేస్తున్నారు. ఉత్తర ద్వారం వద్ద ఉన్న పాత కార్యాలయాన్ని పూర్తిగా పడగొట్టి చదును చేశారు. దక్షిణ ద్వారం నుంచి ప్రధాన అర్చిగేట్ వరకు ప్లాట్‌ఫాం నిర్మిస్తున్నారు. కొత్తగా నిర్మించిన నాలుగు రాజగోపురాలకు రంగుల వేయడం పూర్తి చేశారు.
అలరించిన
‘కనక పుష్య రాగం’
కర్నూలు కల్చరల్: నగరంలోని సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం ప్రదర్శించిన ‘కనక పుష్య రాగం’ సాంఘిక నాటిక ప్రేక్షకులను అలరించింది. విజయవాడ దృశ్య వేదిక వారి ఆధ్వర్యంలో రాఘవ రచనలో ఎస్.కె.మిశ్రో దర్శకత్వం వహించిన ఈ నాటిక ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్ పి.కొండయ్య మాట్లాడుతూ నాటకాలు సామాజిక మార్పునకు ఉపయోగపడతాయన్నారు. రవీంద్ర విద్యా సంస్థల చైర్మన్ జీవీఎమ్ మోహన్ మాట్లాడుతూ నాటకాల ద్వారా ప్రజల్లో చైతన్యం కలుగుతుందన్నారు. నాటక దర్శకులు ఎస్.కె.మిశ్రో మాట్లాడుతూ సామాజిక పరవర్తనకు సాంఘిక నాటికలు మూలమన్నారు. నాటక దర్శకుడికి టీజీవీ కళాక్షేత్రం కార్యవర్గ సభ్యులు రూ. 30వేల పారితోషికం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment