పడగొట్టారు.. వదిలేశారు
పాణ్యం: ఆర్‌అండ్‌బీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు విస్తరణ, కాల్వల నిర్మాణ పేరుతో పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలో హడావుడిగా రోడ్డు పక్కన ఉన్న ఇళ్ల ముందు మెట్లు, గోడలను కూల్చివేశారు. గత నెల 5వ తేదీన యంత్రాలతో తొలగింపు పనులు జరిగాయి. సాక్షాత్తు రాష్ట్ర ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఈ పనులను పరిశీలించారు. మరి నేటికి నెలన్నరరోజులవుతున్నా రోడ్డు విస్తరణ జరగలేదు..కాల్వల నిర్మాణం మొదలుకాలేదు. ఇళ్ల ముందు కూల్చివేతలతో జనం మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు కూడా తీవ్ర సమస్యగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే జాప్యంపై ఆర్‌అండ్‌బీ అధికారి వెంకటేశ్వరరెడ్డి వివరణ కోరగా ఆలమూరు గ్రామం మలుపు వద్ద నుంచి ముందున్న కాల్వలో వర్షపునీటిని కలిపేందుకు రూ. 14లక్షలతో ప్రతిపాదనలు పంపామని, అయితే, ఈ పనులకు సంబంధించి ఇంకా అనుమతులు రాలేదని పేర్కొనడం గమనార్హం.
రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల ముందు
మెట్లు, గోడలు కూల్చివేత
నెలన్నరవుతున్నా
మొదలుకాని పనులు
Comments
Please login to add a commentAdd a comment