‘అఖండ’ వృషభం.. ఆకర్షణీయం
అఖండ సినిమాలో కనిపించి అలరించిన వృషభం బండలాగుడు పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె నుంచి వచ్చిన ఈ వృషభాన్ని తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎమ్మిగనూరు జాతర సందర్భంగా వైడబ్ల్యూసీఎస్ మైదానంలో ఎద్దుల బండలాగుడు పోటీలు ఆదివారం ముగిశాయి. సీనియర్ వృషభాల విభాగ పోటీల్లో మొదటి స్థానాన్ని ఏ. నారాయణపురానికి చెందిన ఎద్దులు సాధించాయి. వాటి యజమాని మహమ్మద్ ఫరీద్కు రూ.లక్ష బహుమతి ఇచ్చారు. ద్వితీయ బహుమతి రూ. 75 వేలు ధర్మవరం సుబ్బారెడ్డి, తృతీయ బహుమతి రూ.50 వేలను ప్రొద్దుటూరుకు చెందిన మర్తల చంద్రఓబుల్రెడ్డి తీసుకున్నారు. అఖండ వృషభానికి నాలుగో బహుమతి వచ్చింది. – ఎమ్మిగనూరు టౌన్
Comments
Please login to add a commentAdd a comment