రుణమో రామచంద్రా..!
వివరాలు 8లో u
పంట రుణాలకుబ్యాంక్ అధికారుల కొర్రీలు
● రుణమాఫీ వర్తించినా.. అందని కొత్త రుణాలు
● సాంకేతిక సమస్యలతో వేలాది మంది దూరం
● మాఫీకి నోచుకోని వారు సైతం వెంపర్లాట
● పాతవి చెల్లిస్తేనే కొత్త వాటికి అర్హులని బ్యాంకర్ల మెలిక
● ఉమ్మడి జిల్లాలో ఐదేళ్లుగా లక్ష్యాన్ని చేరుకోని బ్యాంక్‌లు
● విధిలేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు
● నెలనెలా వడ్డీల భారం మోయలేక సతమతం
అర్హత ఉన్నా రుణమాఫీ కాలేదు..
నాకు రెండెకరాల 30 గుంటల వ్యవసాయ భూమి ఉండగా.. 2018లో రూ. 1.50 లక్షల రుణం తీసుకున్నాను. క్రమం తప్పకుండా రెన్యూవల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వడ్డీతో కలిపి రూ. 1.70 లక్షల అప్పు ఉంది. మొదటి, రెండు విడతల్లో రుణమాఫీ కాలేదు. ఈ విషయంపై అధికారులను సంప్రదిస్తే అన్నివిధాలా మీరు అర్హత కలిగి ఉన్నారు.. త్వరలోనే మీకు రుణమాఫీ వస్తుందని తెలిపారు. కానీ ఇప్పటి వరకు రుణమాఫీ మాత్రం కాలేదు.
– పవన్, యువ రైతు, మాగనూర్
అప్పు చేసి కట్టాను..
మా గ్రామంలో ముగ్గురు, నలుగురికి మినహాయిస్తే అందరి రుణాలు మాఫీ అయ్యాయి. నాకు, నా భార్య పేరుపై రూ.2లక్షలకు పైబడి రుణం ఉందని మాఫీ కాలేదు. రూ.2 లక్షల లోపు రుణం ఉంటే మాఫీ అవుతుందని అందరూ చెబితే, నెలరోజుల క్రితం రూ.91 వేలు అప్పు తెచ్చి, బ్యాంకులో కట్టాను. ప్రస్తుతం ఎవరూ రుణమాఫీ మాటే ఎత్తడం లేదు. బ్యాంకులో అడిగితే రుణమాఫీ కాని వారు చాలామంది ఉన్నారు.. వారికి అయినప్పుడు మీకు అవుతుందని అంటున్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే, మిగిలిన డబ్బులు చెల్లించి కొత్త రుణం తీసుకునే వాళ్లం. రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నాం.
– పుట్ట చిన్నయ్య, రైతు, కొత్తరాంనగర్, ఉప్పునుంతల మండలం
రుణమాఫీ ఊసే లేదు..
కేటీదొడ్డిలో నాకు రెండెకరాలు భూమి ఉంది. నేను గట్టు ఎస్‌బీఐలో రూ.1.50 లక్షల రుణం తీసుకున్నాను. కానీ ఇప్పటివరకు నా రుణం మాఫీ కాలేదు. వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. వారు కూడా ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. నాకు రుణమాఫీ వస్తుందో లేదోనన్న అయోమయంలో ఉన్నా. ఇప్పటికై నా ప్రభుత్వం రుణమాఫీ చేసి ఆదుకోవాలి.
– చిన్నకొండయ్య, రైతు, కేటీదొడ్డి మండలం
రైతు భరోసా లేక.. రుణాలు రాక..
గత ప్రభుత్వంలో రైతుబంధు కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున ఏడాదికి రెండు పర్యాయాలు మొత్తం రూ.12 వేలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యాయి. ఈ మేరకు అన్నదాతలకు పెట్టుబడి అవసరాలు కొంత మేర తీరేవి. కాంగ్రెస్ సైతం రైతు భరోసా కింద ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 11 నెలలు అయినా.. ఇప్పటివరకు రైతు భరోసా అమలుపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఈ క్రమంలో బ్యాంకర్లు రుణాలు ఇవ్వడంలో వెనుకంజ వేస్తుండడంతో రైతులు పెట్టుబడి కోసం నానాతంటాలు పడాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment