వడివడిగా..
కొల్లాపూర్: కల్వకుర్తి నుంచి నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ మీదుగా నంద్యాల వరకు చేపట్టిన జాతీయ రహదారి–167కే నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. రహదారి నిర్మాణంలో భాగంగా చేపట్టి న బైపాస్ పనులు ఊపందుకున్నాయి. నిర్ణీత గడువులోగా ఆయా పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో సంబంధిత అధికారులు ముందుకు సాగుతున్నా రు. అలాగే మల్లేశ్వరం– సంగమేశ్వరం ప్రాంతాల మధ్య కృష్ణానదిపై నిర్మించబోయే ఐకానిక్ సస్పెన్సివ్ కేబుల్ బ్రిడ్జి పనులకు సంబంధించిన టెండర్లు కూడా ఈనెలాఖరులో ఓపెన్ కానున్నాయి.
గత సెప్టెంబర్‌లో టెండర్లు
ఎన్‌హెచ్–167కేలో భాగంగా మల్లేశ్వరం నుంచి సంగమేశ్వరం వరకు కృష్ణానదిపై 87.360 కి.మీ., నుంచి 88.437 కి.మీ., వరకు ఐకానిక్ సస్పెన్సివ్ కేబుల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం గత సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించగా.. అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వచ్చాయి. అయితే ఆయా కంపెనీల అర్హతలను పరిశీలించే ప్రక్రియను నేషనల్ హైవే అథారిటీ అధికారులు చేపట్టారు. ఈ నెల 29న టెండర్ ఓపెన్ చేయనున్నట్లు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.
చౌటబెట్ల చౌరస్తా కోసం..
కొల్లాపూర్ నుంచి చౌటబెట్లకు వెళ్లే దారిలో చౌరస్తా ఏర్పాటు చేయాలని స్థానిక నేతలు కోరుతున్నారు. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్‌హెచ్ అధికారులతో మాట్లాడారు. చౌటబెట్లకు వెళ్లే దారిలో అండర్‌పాస్ బ్రిడ్జి కాకుండా చౌరస్తా ఏర్పాటు చేయాలని.. లేదంటే ఫ్‌లైఓవర్ నిర్మించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు కూడా సంబంధిత అధికారులతో మాట్లాడారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు చౌటబెట్ల దారిలో చౌరస్తా ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది.
రూ.436.91 కోట్లవ్యయంతో..
భారత్‌మాల పథకంలో భాగంగా కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల వరకు జాతీయ రహదారి–167కే నిర్మాణ పనులను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. మొదటి ప్యాకేజీలో భాగంగా రూ.436.91 కోట్ల వ్యయంతో కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు 85 కి.మీ., మేరకు రహదారి నిర్మాణం చేపట్టారు. కల్వకుర్తి నుంచి తాడూరు వరకు, నాగర్‌కర్నూల్ నుంచి కొల్లాపూర్ వరకు రహదారి పనులు చివరి దశకు చేరుకున్నాయి. కల్వకుర్తి, కొల్లాపూర్ సమీపంలో నిర్మిస్తున్న బైపాస్ రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రధాన చౌరస్తాల్లో ఫ్‌లైఓవర్ నిర్మాణాలు చేపట్టారు. మేడిపూర్ సమీపంలోని డిండి వాగుపై వంతెన నిర్మాణం 50 శాతం పూర్తయింది. కొన్నిచోట్ల కల్వర్టుల నిర్మాణాలు సాగుతున్నాయి. గ్రామాల్లో జాతీయ రహదారికి ఇరువైపులా ఇనుప కంచెలు.. మరికొన్ని చోట్ల డివైడర్లు ఏర్పాటు చేశారు.
ఎన్‌హెచ్–167కేపనులు ముమ్మరం
నిర్ణీత గడువులోగా బైపాస్
నిర్మాణాలు పూర్తిచేసేలా చర్యలు
చివరి దశకు మొదటి ప్యాకేజీ పనులు
కృష్ణానదిపై ఐకానిక్ వంతెనకు ఈ నెల 29న టెండర్ల ఓపెన్
చౌటబెట్లకు వెళ్లే దారిలో చౌరస్తాఏర్పాటుపై స్పష్టత కరువు
మార్కింగ్ చేశారు..
కొల్లాపూర్ సమీపంలో చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లింపుల ప్రక్రియను పూర్తిచేశాం. సాంకేతిక కారణాల వల్ల కొందరికి పరిహారం చెల్లింపులో జాప్యం జరిగింది. సోమశిల రోడ్డు నుంచి మల్లేశ్వరం వరకు చేపట్టే జాతీయ రహదారి నిర్మాణ ప్రాంతంలో భూసేకరణ కోసం గతంలో మార్కింగ్ చేశారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే భూసేకరణ ప్రక్రియ చేపడతాం.
– భన్సీలాల్, ఆర్డీఓ, కొల్లాపూర్
Comments
Please login to add a commentAdd a comment