గ్రూప్ – 3 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
నారాయణపేట: గ్రూప్ – 3 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఈనెల 17 ,18 తేదీలలో జరగబోయే గ్రూప్– 3 పరీక్షకు సంబంధించి నిర్వహించిన శిక్షణ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్రూప్– 3 పరీక్షకు 13 సెంటర్లు ఏర్పాటు చేయగా, 4200 మంది అభ్యర్థులు పరీక్ష హాజరవుతున్నట్లు తెలిపారు. డిపార్ట్‌మెంటల్ అధికారులు 14, ఫ్లైయింగ్ స్వ్కాడ్ టీం 4, ఐడెంటిఫికేషన్ అధికారులు 45, రూట్ ఆఫీసర్స్ 4, చీఫ్ సూపరింటెండెంట్స్ 13 మంది... చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్స్ అబ్జర్వర్ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు తెలియజేశారు. చీఫ్ సూపరింటెండెంట్‌లు తమ సెంటర్ నందు పరీక్ష నిర్వహణకు కావాల్సిన తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, సీసీ కెమెరాలు, శానిటైజేషపై దృష్టి సారించాలన్నారు. సెంటర్‌కు మూడు కిలోమీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని తెలియజేశారు. పోలీసులు పరీక్ష కేంద్రం చుట్టుపక్కల 144 సెక్షన్ విధించాలని, ట్రాన్స్‌కో సిబ్బంది విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. కేంద్రాల్లోకి ఏ ఒక్కరిని ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్లను అనుమతించకూడదని అధికారులు ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ రాంచందర్ నాయక్ పాల్గొన్నారు.
పక్కాగా సర్వే వివరాలునమోదు చేయాలి
నారాయణపేట టౌన్: సమగ్ర కుటుంబ సర్వేను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎన్యుమరేటర్లకు సూచించారు. జిల్లా కేంద్రంలోని 4, 5 వార్డుల్లో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటి సర్వేను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్న తీరు, నిర్ణీత ఫారంలో కోడ్‌ల వారీగా వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. సిబ్బందికి ప్రజలు సహకరించాలని, ఎలాంటి అనుమానం లేకుండా వివరాలు తెలపాలన్నారు. మున్సిపల్ కమిషనర్ సునీత, టీపీఓ కిరణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment