జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి గుట్టుచప్పుడు కాకుండా సన్నాహాలు మొదలయ్యాయి. దీనిపై స్థానికంగా వ్యతిరేకత పెల్లుబికింది. కేవీపీఎస్ వంటి ప్రజా సంఘాలతో పాటు రాజకీయ పక్షాలు స్పందించాయి. ఫ్యాక్టరీ నిర్మించొద్దని.. అనుమతులు రద్దు చేయాలంటూ సీపీఎం, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు నిరసనల్లో పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్‌కి వెళ్లి వినతిపత్రం సైతం అందజేశారు. అధికార కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్ పెట్టి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. కాగా..ఈ ఫ్యాక్టరీ ఏర్పాటైతే భవిష్యత్‌లో పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, నసనూర్, మాన్‌దొడ్డి, తుమ్మిళ్ల, పచర్ల, అయిజ మండలంలోని చిన్న తాండ్రపాడు, వెనుసొంపురం గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment