లగచర్ల ఘటన ఇంటెలిజెన్స్ వైఫల్యమే..
దామరగిద్ద: కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో అధికారులపై జరిగిన దాడి ఘటన పూర్తిగా పోలీసులు, ఇంటెలిజెన్స్ యంత్రాంగం వైఫల్యమేనని బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావ్ నామాజీ ఆరోపించారు. బుధవారం లగచర్ల రైతులకు న్యాయం చేయాలని సంఘీబావంగా వెళుతున్న వారిని పోలీసులు అడ్డుకొని దామరగిద్ద స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరెస్టులు చేయడం ప్రభుత్వ దమననీతికి నిదర్శనమన్నారు. లగచర్ల ఘటన పూర్తిగా చట్టవిరుద్దమన్నారు. బీజేపీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని అధికార యంత్రాంగం రైతులతో చర్చలు జరపకుండా ల్యాండ్ అక్విజేషన్‌కు పాల్పడిందన్నారు. ఎదురు తిరిగిన రైతులతో పాటు సంబంధంలేని వ్యక్తుల పై కేసులు పెట్టడం సరికాదన్నారు. భూ సేకరణకు రైతులు వ్యతిరేకిస్తున్న విషయం ఇంటెలిజెన్స్‌కు తెలియదా అని ప్రశ్నించారు. తండా వాసులను అమానుషంగా అరెస్ట్ చేయడం, ఇంటర్నెట్, విద్యుత్ సేవలను నిలిపివేసి ప్రజలకు సమాచార సంబంధాలను లేకుండా చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం న్యాయవిచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారి ప్రతినిధి వెంకటయ్య, బీజేపీ మున్సిఫల్ ప్లోర్ లీడర్ సత్యరఘుపాల్, జిల్లా కార్యదర్శి గోపాల్‌రావ్, మండల పార్టీ అద్యక్షుడు సత్యనారాయణ, మైనార్టీ మోర్చ నాయకుడు నభీ, యువమోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రకాష్ పాల్గొన్నారు.
ఎక్కడికక్కడే నాయకుల అరెస్ట్
నారాయణపేట: వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామాన్ని సందర్శించేందుకు వెళుతున్న బీజేపీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. నాగురావు నామాజీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సత్యరాఘుపాల్, గోపాల్ రావు,వెంకటయ్యను దామరిగిడ్డలో అరెస్ట్ చేశారు. అలాగే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాసులు, ఓబీసీ మో ర్చా రాష్ట్ర నాయకుడు కే.శ్రీనివాసులు ఇతర నాయకులను కోటకొండలోని అధ్యక్షుడి ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment