ప్రక్షాళన దిశగా..
పీయూ అడ్మినిస్ట్రేషన్‌లోమొదలైన మార్పులు
● ఆ విభాగంలో కొన్నేళ్లుగాపాతుకుపోయిన సిబ్బంది
● గత వీసీ హయాంలో జరిగిన అక్రమాలకు దన్నుగా నిలిచారని ఆరోపణలు
● ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్న వారిని తప్పించాలని విద్యార్థి సంఘాల డిమాండ్
● కిందిస్థాయి సిబ్బందిని మార్పుచేయనున్నట్లు గుసగుసలు
పీయూ ముఖద్వారం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ కొత్త వైస్ చాన్స్‌లర్‌గా జీఎన్ శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అడ్మినిస్ట్రేషన్ విభాగంలో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం ఐక్యూఏసీ (ఇంటర్నల్ క్యాలిటీ అసెస్‌మెంట్) డైరెక్టర్‌గా నూర్జహాన్‌ను నియమించారు. అలాగే అడ్మినిస్ట్రేషన్‌లో కీలక పోస్టు అయిన రిజిస్ట్రార్‌ను నూతనంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చెన్నప్పను నియమించారు. ఈ మేరకు గురువారం బాధ్యతలు చేపట్టిన ఆయనకు పీయూ వీసీతో పాటు ఇతర అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చాలాకాలంగా అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పాతుకుపోయిన పలువురు సిబ్బందిని కూడా మార్పులు చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఎప్పటి నుంచో విద్యార్థి సంఘాల నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్ ఇదే.
పెద్దఎత్తున అక్రమాలు..
గత వీసీ హయాంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు కొత్త వీసీతో సహా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు కూడా ఫిర్యాదులు చేశారు. దీంతో ఈ విషయా న్ని అటు ప్రభుత్వం, ఇటు కొత్త వైస్‌చాన్స్‌లర్ కూడా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు అప్ప ట్లో జరిగిన పలు అక్రమాల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది పాత్ర ఉన్న ట్లు తెలుస్తుంది. వీరి వ్యవహారం కూడా అధికారుల దృష్టికి రావడంతో వీరిని కూడా మార్పు చేసే అవకాశం ఉన్నట్లు యూనివర్సిటీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సమూల మార్పులు, పారదర్శక పాలన ఉండాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డితో జరిగిన వీసీల సమావేశంలో సూచించారు. ఇందుకు అనుగుణంగా మార్పులు, చేర్పులకు వీసీ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది.
వివాదాస్పద తీరు..
కొంతకాలంగా అడ్మినిస్ట్రేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కొందరు సిబ్బంది వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. గతంలో జరిగిన పలు అవకతవకలకు సిబ్బంది కూడా సహకరించినట్లు తెలుస్తుంది. పాత వీసీ మే నెలలో పదవీ విరమణ చేసిన తర్వాత ఐఏఎస్ అధికారి ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఈ క్రమంలో చిన్నపాటి అవసరాల కోసం పెద్దమొత్తంలో బిల్లులు పెట్టి డబ్బులు డ్రా చేసినట్లు ఆరోపణ లు వినిపిస్తున్నాయి. ఈ విషయం అప్పట్లో ఉన్న అధికారులకు తెలిసినా ఏమీ అనలేదని తెలుస్తుంది. పలువురు కాంట్రాక్టర్లు, అప్లియేటెడ్ కళాశాల యాజమాన్యాలకు సంబంధించి బిల్లులు, ఫైల్స్‌పై పని జరగాలంటే పలువురి సిబ్బంది చేయి తడపాలన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న వీరి తీరు యూనివర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment