
సీసీ కెమెరాలతో నేరాల కట్టడి
నారాయణపేట: నేరాలను నియంత్రించడం.. నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఇక పల్లెలు సైతం ఒక్కొక్కటి సీసీ నిఘా నీడలో ఉండబోతున్నాయని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలలో రూ 8 లక్షలతో జాజాపూర్‌లో 26 సీసీ కెమెరాలు, పోలీసు స్టేషన్‌లో 3, కొల్లంపల్లిలో 11, చిన్న జట్రంలో 5, అప్పిరెడ్డిపల్లిలో 6 సీసీ కెమెరాలను డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, ఆయా గ్రామాల గ్రామ పెద్దలతో కలిసి బుధవారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను కోరారు. వీటి వల్ల గ్రామానికి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా తెలుస్తుందని, గ్రామంలో ఎలాంటి అలజడి జరిగిన వెంటనే పోలీసులు చేరుకుని నివారించడానికి అవకాశం ఉంటుందన్నారు. గ్రా మాల్లోని సీసీ కెమెరాలు జీపీఎస్ కనెక్ట్ చేయడం వల్ల జిల్లా, హైదరాబాద్ కమాండ్ కంట్రోల్‌కి అనుసంధానం చేసి వీక్షించడానికి అవకాశం ఉంటుందన్నారు. పట్టణ, మండల, అన్ని గ్రామాల ప్రజలు, వ్యాపారులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పా టు చేసుకోవాలని.. వీటి ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించేందుకు అవకాశం, అసాంఘిక కార్యక్రమాలు నిర్మూలించే అవ కాశం ఉంటుందని తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తదితర ఘటనలు జరిగిన సమయంలో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవవనికి వీలు ఉంటుందని తెలిపారు.
ప్రజలు భాగస్వామ్యం కావాలి
డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ... జిల్లాలో నేరాలు అదుపు చేయడానికి పోలీసులతోపాటు ప్రజలను భాగస్వామ్యం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అని అన్నారు.తీసుకురావడంతో ఎస్పీని అభినందిస్తున్నామన్నారు. ఇలాగే జిల్లాలో నేరాల నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, అందుకు పోలీసులకు సహకరించాలని అన్ని గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని తెలిపారు. కార్యక్రమంలో సిఐ శివ శంకర్, ఎస్‌ఐ లు రాముడు, వెంకటేశ్వర్లు,వివిధ గ్రామాల నాయకులు గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ యోగేష్ గౌతమ్
వివిధ గ్రామాల్లో 51 సీసీ కెమెరాలు
ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment