పాఠాలు చెప్పడం లేదంట..
నా కూతురు మరికల్ కేజీబీవీలో పదో తరగతి చదువుతోంది. 15 రోజుల నుంచి ఉపాధ్యాయులు సమ్మెలో ఉండటంతో పాఠాలు చెప్పడంలేదంట. పరీక్షలకు సిద్ధం కావాల్సిన అంశాలను వివరించే వారు లేకపోతే ఎలా ఉతీర్ణత అవుతారు. తమ పిల్లలు ఉతీర్ణత కాకుంటే దీనికి ఎవరూ బాధ్యత వహిస్తారు. ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి.
– చంద్రకళ, పదో తరగతి విద్యార్థిని తల్లి
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
పదో తరగతి, ఇంటర్ విద్యార్థినుల పరీక్షలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమ్మెలో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలి. వార్షిక పరీక్షల సమయం దగ్గర పడుతున్న సమయంలో సిలబస్ పూర్తికాక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సమ్మె ఇలాగే కొనసాగితే విద్యార్థులు త్రీవంగా నష్టపోయే అవకాశం ఉంది.
– రాంరెడ్డి, పదో తరగతి విద్యార్థిని తండ్రి, పూసల్‌పహాడ్
నష్టం కలగకుండా చూస్తాం
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రస్తుతం పదో తరగతి, ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతుండటంతో ఉన్న వనరులను ఉపయోగించుకుంటాం. కేజీబీవీలో అందుబాటులో ఉన్న డిజిటల్ తరగతులను నిర్వహిస్తాం. ఇందుకుగాను ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు ఎంఈఓలను ఆదేశించడం జరిగింది. విద్యార్థులకు నష్టం కలగకుండా చూస్తాం.
– గోవిందరాజులు, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment