ఫిన్‌లాండ్ స్ఫూర్తితో విద్యార్థులకు బోధన..
విద్యార్థులకు ఒత్తిడి లేకుండా, సులువుగా విద్యను అందించడంలో ఫిన్‌లాండ్ దేశం ముందువరుసలో ఉంది. అక్కడ మాథ్స్, సైన్స్ విద్యాబోధనలో అమలవుతున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడి విద్యార్థుల కోసం మాథ్స్ ల్యాబ్ రూపొందించాను. గణితం పట్ల విద్యార్థుల్లో భయం పోగెట్టేలా సులువైన విధానంలో బోధిస్తున్నాను. ఈ విధానంలో విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపుతుండటం ఆనందాన్ని కలిగిస్తోంది.
– కూన శ్రీనివాసులు, గణిత ఉపాధ్యాయుడు, మార్చాల
కల్వకుర్తి మండలం మార్చాల ప్రభుత్వ పాఠశాలలో ఉమ్మడి జిల్లాలోనే తొలిసారిగా మ్యాథమెటికల్ ల్యాబ్ ఏర్పాటైంది. సైన్స్‌లో విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ తరహాలోనే గణితానికి సంబంధించిన ఆవిష్కరణలకు ఈ ల్యాబ్ ప్రాక్టికల్‌గా విద్యార్థులు అనుభూతి పొందేందుకు వీలు కలుగనుంది. గణితంలో క్లిష్టమైన అంశాలను అతి సులువుగా విద్యార్థులకు బోధించేందుకు వీలుగా ఈ ల్యాబ్‌ను ఉపాధ్యాయుడు కూన శ్రీనివాసులు రూపొందించారు. 85 రకాల క్లిష్టమైన అంశాలను ఈ ల్యాబ్‌లో పొందుపర్చారు. ఒక్కో కాన్సెప్ట్‌ను పది నిమిషాల చొప్పున వివరించడం ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోవడం సులువు అవుతుంది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు అవసరమైన మ్యాథమెటికల్ కాన్సెప్ట్‌లు ఇందులో ఉంటాయి. టేబుల్స్, అల్గారిథమ్స్, అర్థమెటిక్ అంశాలను అతి సులువుగా విద్యార్థులకు బోధించేలా మ్యాథ్స్ ల్యాబ్‌ను రూపొందించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ పొందిన శ్రీనివాసులు విద్యార్థులకు వినూత్న పద్ధతిలో గణితం బోధిస్తున్నారు.
మార్చాలలోమ్యాథ్స్ రూం
Comments
Please login to add a commentAdd a comment