జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలి
నారాయణపేట రూరల్: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 317 బాధితులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి న్యాయం చేయాలని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య డిమాండ్ చేశారు. శనివారం నారాయణపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీఓ 317 సమస్యలపై దాటవేత వైఖరి పట్ల రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా తీవ్రంగా నిరసిస్తున్నారని, బాధితులందరికీ న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నారని గుర్తు చేశారు. భార్యాభర్తలు, ఆరోగ్య కారణాలతో బదిలీలకు జీఓలోనే అవకాశం ఉందని, స్థానికత కోల్పోయిన వారి గురించి నిర్ణయం చేయకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని బాధితులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ హామీ మేరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు క్లియర్ చేయాలని ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో నల్గొండలో జరిగే రాష్ట్ర మహాసభలకు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు. కె.రవికుమార్, కె.శివరాములు, కె.బాలాజీ కోశాధికారి భీమయ్య,కృష్ణగౌడ్, రవికుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment