సమసమాజ నిర్మాణమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యం
నారాయణపేట రూరల్: సమాజంలో సనాతన ధర్మ రక్షణ, సమసమాజ నిర్మాణమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని సంఘ్ ప్రాంతీయ సహ వ్యవస్థ ప్రముఖ్ గంట తిర్మల్ జీ అన్నారు. ఆదివారం మండలంలోని జాజాపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉప మండల వార్షికోత్సవ పద సంచాలన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యవక్తగా హాజరై మాట్లాడారు. హైందవ ధర్మం అనాదిగా ఆటుపోట్లను ఎదుర్కొంటూ అతీతశక్తిగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం కొన్ని స్వార్థ శక్తులతో సనాతన ధర్మంపై విపరీత దాడులు జరుగుతున్నాయని.. సనాతన ధర్మం లేకుంటే మనిషి మనుగడకే ముప్పని, పరిరక్షించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ కృత నిశ్ఛయంతో పని చేయాలని చెప్పారు. శ్రీగిరి పీఠం సదానందస్వామి మాట్లాడుతూ.. ధర్మాన్ని మనం రక్షిస్తే.. అది మనను రక్షిస్తుందన్నారు. గ్రామస్తులు సంఘ్ కార్యకర్తలు నిర్వహించిన పద సంచాలన్‌కు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఖండ కార్యవాహ లక్ష్మణ, తపస్ జిల్లా అధ్యక్షుడు షేర్ కృష్ణారెడ్డి, కార్యకర్తలు
పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment