ఘనంగా స్వామి వివేకానంద జయంతి
మక్తల్: పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. అలాగే పట్టణంలో లయన్స్‌క్లబ్, ఏబీవీపీ, అయ్యప్పస్వామి డిగ్రీ కళాశాల, వివేకానంద, చైతన్య జూనియర్ కళాశాలల్లోనూ జయంతి వేడుకలు నిర్వహించారు. జక్లేర్‌లో కాంగ్రెస్ నాయకుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండలంలోని చిట్యాల, పంచలింగాల, రుద్రసముద్రం, మంతన్‌గోడ్, అనుగొండ, గుడిగండ్ల తదితర గ్రామాల్లోనూ వేడుకలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment