కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాల మేరకు సర్వేయర్లు చేపట్టిన ఇళ్ల సర్వేను ఎంపీడీఓలు, పుర కమిషనర్లు వారి వారి పరిధిలో 5 శాతం క్రాస్ చెక్ చేస్తున్నారు. దరఖాస్తుదారుడు ఉంటున్న ఇంటి పరిస్థితిని పరిశీలించడంతో పాటు ఇందుకు సంబంధించి మూడు ఫొటోలు తీయిస్తున్నారు. సర్వేలో అవకతవకలేమైనా జరిగాయా అనేదానిపై గృహనిర్మాణశాఖ దృష్టి సారించింది. యాప్‌లో ప్రజాపాలన దరఖాస్తుల వివరాలే నమోదు చేశారా? లేక దరఖాస్తుదారుల లబ్ధి కోసం సర్వేయర్లు తప్పుడు సమాచారం నమోదు చేశారా అనేది తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. గృహనిర్మాణశాఖ ఉన్నతాధికారుల నుంచి అందిన దరఖాస్తులను మండలాలు, పురపాలికల్లోని అధికారులు క్షేత్రస్థాయిలో యాప్‌లో నమోదు చేసిన వివరాలతో సరిపోల్చుతున్నారు. దరఖాస్తుదారు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు సొంతమా, అద్దెదా, గుడిసెలో ఉంటున్నారా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment