హడలెత్తిస్తున్న చిరుతలు
మరికల్: అటవీ ప్రాంతానికి సమీపంగా ఉన్న గ్రామాల్లో చిరుతలు తరచూ పశువులపై దాడులు చేసి మూగజీవాలను మట్టుపెడుతున్నాయి. దీంతో రాత్రి వేళల్లో బయటికి రావాలన్నా.. పొలం వద్దకు వెళ్లాలన్న ప్రజలు వణికిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిరుతల సంచారం రోజుకు, రోజుకు అధికమవ్వడంతో రైతన్నలకు కంటిమీద కునుకు లేకుండా పొయింది. ఐదేళ్లుగా గ్రామాల సమీపంలోకి చిరుతలు వస్తుండటంతో ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. పశువులపై దాడిచేసి చంపేస్తున్నాయి. రైతుల నుంచి ఫిర్యాదులు అందుకున్న అటవీ శాఖ అధికారులు గుట్టలో పెట్టిన బోనులు కూడా చిరుతలు చిక్కకుండా తప్పించుకుంటున్నాయి.
చిరుతల బెడద..
సీసీ కెమెరాల ఏర్పాటు
మరికల్ మండలంలో రాకొండ, పూసల్‌పహాడ్, అప్పంపల్లి, మాధవరం, నారాయణపేట మండలం ఎక్లాస్‌పూర్, లక్ష్మీపూర్, కొల్లంపల్లి పరిధిలోని తండాలు, దామరగిద్ద మండలం కంసాన్‌పల్లి, బాపన్‌పల్లి, ధన్వాడ, మద్దూరు, కోస్గి, కోయిల్‌కొండ మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు చిరుత పులుల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుట్టలో ఏపుగా పెరిగిన చెట్లు పొదలలో అవి సంచరించడానికి అనువైన వాతావరణం ఉండటమే ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు. ఎక్లాస్‌పూర్ అటవీ ప్రాంతంలోనూ ఈ మధ్యకాలంలో అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎక్లాస్‌పూర్ మొదలుకొని కోయిల్‌కొండ వరకు ఆరు చిరుతలు సంచరిస్తున్నట్లు చెబుతున్నారు. ఆహారం కోసం వ్యవసాయ పొలాల వద్ద కట్టెసిన పశువులపై రాత్రి వేళల్లో దాడి చేసి చంపేస్తున్నాయి.
తరచూ పశువులపై దాడి
గడిచిన ఐదేళ్ల వ్యవధిలో మరికల్ మండలం పూసల్‌పహాడ్, పల్లెగడ, అప్పంపల్లి శివారులో పదుల సంఖ్యలో పశువులను బలితీసుకున్నాయి. నారాయణపేట మండలం బైరంకొండ అటవీ ప్రాంతంలో పశువులు, మేకలు, గొర్రెల మందలపై దాడి చేసి ఐదు జీవాలను చంపేశాయి. అలాగే, గొర్రెల మంద వద్ద ఉన్న రెండు గుర్రాలను సైతం మట్టుబెట్టాయి. బండగొండ, కొటకోండ, తిర్మలాపూర్, లక్ష్మీపూర్‌లో చిరుతలు సంచరిస్తున్నాయి. దామరగిద్ద తండా కంసాన్‌పల్లి, బాపన్‌పల్లిల్లో పశువులు, మేకలపై దాడులు చేశాయి. ధన్వాడ మండలం మందిపల్లితండా, కిష్టాపూర్, కొండాపూర్, రాంకిష్టాయ్యపల్లిలో లేగదూడలు, మేకలు కూడా వీటి దాడిలో చనిపోయాయి. కోయిల్‌కొండ మండంలోని ఆచార్యపూర్, అంకిళ్ల గ్రామ శివారులో ఐదు పశువులు మృతి చెందాయి. మద్దూరు , కొత్తపల్లి మండలాల పరిదిలోని గోకుల్‌నగర్, పల్లెర్ల, పెదిరిపాడ్‌తాండ, కోస్గి మండలం బలభద్రాయపల్లి, అప్పాయిపల్లిలోనూ జీవాలను మట్టుపెట్టాయి.
పశువులపై వరుస దాడులు
భయాందోళనలో ప్రజలు
పలు మండలాల్లో చిరుతల సంచారం
ఆరు సంచరిస్తున్నట్లు
అధికారుల గుర్తింపు
Comments
Please login to add a commentAdd a comment