సంప్రదాయాలను కాపాడుకోవాలి
అమరచింత: తెలుగింటి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఐజీ రమేష్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన స్వగ్రామమైన మస్తీపూర్‌కు వచ్చారు. సోమవారం గ్రామంలో ఇంటింటికెళ్లి రంగవల్లులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండగలు మన సంప్రదాయాలను గుర్తు చేస్తాయన్నారు. పండగ వాతావరణం పల్లెలోనే అత్యధికంగా కనిపిస్తుందని అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కాంక్షించారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు నగదు బహుమతులను అందజేశారు.
18న నవోదయ ప్రవేశ పరీక్ష
బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో చేరికకు శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాలయ ప్రిన్సిపల్ పి.భాస్కర్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 27 కేంద్రాలను ఎంపిక చేశామని, విద్యార్థులు www.navodaya.gov.in అనే వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ల కోసం వెబ్‌సైట్‌లో తమ పుట్టిన తేదీతో లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో గురువారం బిజినేపల్లిలోని ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, పరిశీలకులకు శిక్షణ ఇస్తామని చెప్పారు.
భోగ భాగ్యాలతో తులతూగాలి
కొల్లాపూర్: తెలుగు ప్రజలకు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ఒక ప్రకటనలో సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగభాగ్యాలు, సిరిసంపదలు, ఆనందోత్సహాలతో పండుగ జరుపుకోవాలని, ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నానన్నారు. ఆరుగాలం శ్రమించే రైతన్నల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, సాంస్కృతిక వైభవాన్ని చాటేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషిచేస్తోందని వెల్లడించారు.
కోటిలింగేశ్వరుడికి
రుద్రాభిషేకాలు
కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి స్టేజీ వద్దనున్న సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకోటిలింగేశ్వర దత్త దేవస్థానంలో సోమవారం ప్రత్యేక పూజలు, పాలాభిషేకం, రుద్రాభిషేకాలు నిర్వహించారు. పౌర్ణమి, శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రనక్షత్రం కలిసి వచ్చిన సందర్భంగా భక్తులు పెద్దఎత్తున కోటిలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరంలో ప్రతిష్ఠించిన పాదరస సహిత నవరత్నాలంకృత స్వర్ణకవచ పంచలోహ శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేశారు. పాదరస శివలింగానికి జలాభిషేకం చేశారు. కోటిలింగాల ప్రతిష్ఠలో భాగస్వాములయ్యారు. ధ్యాన మందిరంలో అర్చకులు రుద్రహోమం నిర్వహించి.. పూర్ణాహుతి, మహా మంగళహారతి సమర్పించారు.
నేటితో ముగియనున్న నగర సంకీర్తన
దేవరకద్ర: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు తెల్లవారు జామున మండల కేంద్రంలో నిర్వహిస్తున్న నగర సంకీర్తన మంగళవారం ముగుస్తుందని ఈశ్వర వీరప్పయ్యస్వామి దేవస్థాన కమిటీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం నగర సంకీర్తన నిర్వహించిన అనంతరం దేవాలయం వద్ద భ జన పరులతో ఆయన మాట్లాడారు. దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రా రంభమైందన్నారు. దీంతో మంగళవారం నగ ర సంకీర్తనను నిర్వహించి ఆలయాల్లో పూజలు చేస్తామన్నారు. భజనమండలి వారికి, బాలబాలికలకు సన్మానిస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment