మహిళల రక్షణేషీ టీం లక్ష్యం
నారాయణపేట: మహిళల రక్షణ కోసం షీ టీంలు ఉన్నాయని, యువతులు, బాలికలు ఎవరైనా వేధింపులకు గురైతే నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని ఎస్పీ యోగేష్ గౌతమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మహిళల రక్షణ కోసం షీటీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీంలు పనిచేస్తున్నాయని, విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడవద్దని, గృహహింసకు గురైనా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యాలయాలు, ఉద్యోగ ప్రదేశాలు, బస్టాండ్, కాలనీల్లో ఎక్కడైనా ర్యాగింగ్, ఈవ్ టీచింగ్, వేధింపులకు గురైనా షీ టీం పోలీసులను ఆశ్రయిస్తే సత్వర న్యాయం అందేలా చూస్తామని, నేరుగా సంప్రదించలేని వారు సెల్ నం.8712670398 కు లేదా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు.
గ్రామీణ క్రీడలు ఐక్యతకు దోహదం
నర్వ: గ్రామీణ క్రీడల ద్వారా పల్లెల్లో రైతులకు ఆహ్లాదం, ఆనందం కలుగుతుందని.. ఐక్యతకు దోహదపడతాయని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని నాగిరెడ్డిపల్లిలో నిర్వహించిన ఎడ్లబండ్ల గిరక పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం పోటీలలో విజేతలైన రైతులకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలని, పోటీలను స్పోర్టివ్‌గా తీసుకొని పాల్గొని గెలుపోటలను సమానంగా స్వీకరించాలన్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానన్నారు.కార్యక్రమంలో నాయకులు బీసం చెన్నయ్యసాగర్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శరణప్ప, వివేకవర్ధన్‌రెడ్డి, సంజీవారెడ్డి, చంద్రశేఖర్, చంధు తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
జడ్చర్ల టౌన్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలో ఐదో తరగతిలో ప్రవేశం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని చిట్టెబోయిన్‌పల్లి పాఠశాల ప్రిన్సిపాల్ అనిత్ బుధవారం ఓ ప్రకటనలో సూచించారు. ఈ నెల ఒకటో తేదీ వరకు కులం, ఆదాయం, ఆధార్‌నంబర్, బర్త్ సర్టిఫికెట్, పాస్‌ఫొటోతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వ్యవసాయ కార్మికులకు రూ.12 వేలు ఇవ్వాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: భూమిలేని వ్యవసాయ కార్మికులందరికీ రూ.12 వేలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా వంద రోజులు పనిపొందిన కుటుంబాల ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌బుక్ ఆధారంగా రూ.12 వేలు ఇవ్వాలన్నారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు. ఎవరెవరికి ఎలా ఇస్తారనే దానిపై విధివిధానాలు ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో సంఽఘం జిల్లా ప్రధానకార్యదర్శి కడియాల మోహన్, జిల్లా ఉపాద్యక్షుడు హనుమంతు, నాయకులు రఘు, రాములుపాల్గొన్నారు.
విజయంతో తిరిగి రావాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: చైన్నెలో ఆరు రోజుల పాటు కొనసాగే అఖిల భారత దక్షిణ ప్రాంత పోటీలకు పీయూ క్రికెట్ జట్టు (పురుషుల) బుధవారం బయలుదేరింది. అంతకుముందు క్రీడాకారులకు వైస్ చాన్స్‌లర్ జి.ఎన్.శ్రీనివాస్ ట్రాక్‌సూట్, క్రికెట్ యూనిఫాం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు తమిళనాడులోని యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయంతో తిరిగి రావాలని, పాలమూరు యూనివర్సిటీకి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. ప్రిన్సిపాల్ డా.బషీర్‌అహ్మద్, సీనియర్ అధ్యాపకులు డా.అర్జున్‌కుమార్, పీడీలు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, సురేష్, కోచ్‌లు అబ్దుల్లా, అబిద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment